ఇజ్రాయెల్ అణుశక్తి వెనక ఉన్న రహస్యం ఏమిటీ?
అణు ప్రక్రియను గుప్తంగా ప్రారంభించి పూర్తి చేసిన టెల్ అవీవ్;
By : KS Dakshina Murthy
Update: 2025-06-21 13:21 GMT
ఇజ్రాయెల్ చాలాకాలం క్రితమే అణు సామర్థ్యం సాధించింది. ఇది బహిరంగ రహస్యం. అధికారిక ధృవీకరణ లేకుండా ఆ దేశం ప్రపంచ పరిశీలన నుంచి మినహయింపు పొందింది.
ఫెడరల్ ఈ తాజా ఎపిసోడ్ లో ఇజ్రాయెల్ దీర్ఘకాలిక అణు అస్ఫష్టత విధానం, భౌగోళిక రాజకీయ చిక్కులు, పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాము.
అణు స్పష్టత అంటే ఏమిటీ?
అస్పష్టత అంటే స్పష్టంగా అవును లేదా కాదు అని కాదు. కానీ ఇజ్రాయెల్ తన అణ్వస్త్ర స్థితిని ఈ విధంగానే నిర్వచిస్తుంది. ఎప్పుడూ కూడా తన వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు ధృవీకరించలేదు.
అలాగని తిరస్కరించలేదు. ఇది దాని ఉద్దేశపూర్వక వైఖరని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ ఎప్పుడూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదు. అలాగే అది తరుచుగా అంతర్జాతీయ పర్యవేక్షణకు అంగీకరించకుండా ప్రతిఘటించింది.
ఇప్పటికి అంగీకరించలేదు..
ఇజ్రాయెల్ దగ్గర 1960 నుంచే అణ్వాయుధాలను కలిగి ఉందని సమాచారం. అయితే ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం దీనిని అంగీకరించలేదు. కానీ స్వతంత్య్రం గా దేశాల అణ్వాయుధ శక్తిని అంచనా వేసే సిప్రి నివేదిక ప్రకారం.. యూదు దేశం వద్ద దాదాపుగా 90 అణు వార్ హెడ్లు ఉన్నాయి.
వీటిని విమానం, క్షిపణులు, జలాంతర్గాముల ద్వారా ప్రయోగించే అవకాశం ఉంది. గతవారం ఇజ్రాయెల్, ఇరాన్ అణుకేంద్రాల నుంచి పై దాడి చేసింది. గల్ప్ లో తన దగ్గర తప్ప వేరే వారి దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదనే దాని పాలసీ ప్రకారం దాడులు చేస్తోంది.
పాశ్చాత్య మద్దతు..
అమెరికా, దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్ అణు కార్యక్రమాన్ని పట్టించుకోవు. ఇజ్రాయెల్ అణు సౌకర్యాలను ఐఏఈఏ పర్యవేక్షించాలని ఖతార్ డిమాండ్ చేసింది. అయితే దీనిని ఎవరూ పట్టించుకోలేదు.
చారిత్రక తప్పులు, వ్యూహత్మక పొత్తులు, ప్రచ్చన్న యుద్ధ రాజకీయాలు ఇజ్రాయెల్ తప్పులు బయటపడకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం జవాబుదారితనాన్ని ఎదుర్కొంటోంది.
తప్పుడు వాదన..
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ విమర్శకులు ఈ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపుతున్నారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ వాటిని సంపాదించుకునే అధికారం ఇతర దేశాలకు లేకపోవడం ఎలా న్యాయమైనది.?
ఇరాన్ వంటి దేశాలలో ఇది తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ తన సొంత అణ్వాయుధ ఆయుధశాలను మాత్రం తన శత్రుదేశాల బూచిని చూపించి సమర్థించుకుంటోంది.
ఇజ్రాయెల్ అణు కార్యక్రమం..
ఇజ్రాయెల్ అణు ప్రయాణం 1950 లలో ఫ్రాన్స్ సహాయంతో ప్రారంభం అయింది. ఇది నెగెవ్ ఎడారిలోని డిమోనాలో ఉంది. అమెరికా 1960 లో ఈ ప్రాజెక్ట్ ను కనిపెట్టింది కానీ తనకు ఏమి తెలియనట్లే నటించింది. అయితే ఈ అణ్వాయుధ ప్రాజెక్ట్ ను ప్రవేశపెట్టింది మేము కాదని ఇజ్రాయెల్ వాదన.
ఎలా బయటపడింది..
1986 లో విజిల్ బ్లోయర్ మెర్డే చాయ్ వనును సండే టైమ్స్ కోసం కొన్ని ఫొటోలు, పత్రాలు లీక్ చేశారు. అప్పుడు తొలి సాక్ష్యం బయటకు వచ్చింది. తరువాత ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ అతడిని అపహరించి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తరువాత కూడా పత్రికలతో మాట్లాడకుండా నిషేధం విధించింది.
తిరస్కరణ..
ఇజ్రాయెల్ అనధికారిక సిద్దాంతాలైన బిగిన్ డాక్ట్రిన్- సామ్సన్ ఆప్షన్ దాని సైనిక వైఖరికి నిదర్శనాలు. 1981 లో ఇరాక్ లోని ఒసిరాక్ రియాక్టర్ పై బాంబు దాడి నుంచి 2007 లోని సిరియాలోని అల్ కిబార్ ప్రాంతం వరకూ ఏ ప్రత్యర్థి అణ్వాయుధాలు తయారీ చేయకుండా అడ్డుకుంది.
సైబర్ వార్ ఫేర్.. హత్యలు..
ఇరాన్ తన అణు కేంద్రాలను బాగా రక్షించుకుంది. దానితో టెల్ అవీవ్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుంది. 2010 లో నటాన్జ్ లోని సెంట్రీప్యూజ్ లను దెబ్బతీయడానికి అమెరికాతో కలిసి స్టక్స్ నెట్ మాల్వేర్ ను ఉపయోగించింది.
2020 లో శాస్త్రవేత్త మొహ్సెన్ ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు. ఇటీవల ఇజ్రాయెల్ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ లోపల విధ్వంసం, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్ తన అణ్వస్త్ర స్థితిపై మౌనం వహించడం వల్ల దాని ప్రభావం తగ్గదు. పాశ్చాత్య దేశాల మద్దతు, దూకుడుగా సాగే ప్రతి వ్యాప్తి చర్యల ద్వారా పశ్చిమాసియాలో అధికార సమతుల్యత ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఇది న్యాయబద్దత, జవాబుదారీతనం, అణు దౌత్యం భవిష్యత్ తక్షణ ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది.