కర్నాటక బస్సు ప్రమాదం, 17 మంది మృతి
x

కర్నాటక బస్సు ప్రమాదం, 17 మంది మృతి

గురువారం తెల్లవారుజామున ప్రమాదం


కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో చిత్రదుర్గ గోర్లతు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బస్సు లో మంటలు లేచాయి. 17మంది సజీవ దహనం అయినట్లు తెలిసింది. మరొక 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బస్సును ఢీకొంది. దీనితో డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు లేచాయని బస్సు డ్రైవర్ తెలిపారు. గాయపడిన వారిని హరియూర్ , షిరా ఆసుపత్రులకు తరలించారు. మిలన్, కవిత, సంధ్య అనే మహిళలు మంటలు రేగగానే బస్సు నుంచి దూకి బయటపడ్డారు. స్వల్పంగా గాయపడటంతో వారిని కూడా చికిత్సకు తరలించారు.

బస్సులో ప్రయాణిస్తున్న 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

బెంగళూరు నుండి గోకర్ణకు వెళ్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం జరిగింది.

హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ డివైడర్ ను దాటుకుని ప్రైవేట్ బస్సును ఢీ కొంది.

నిద్రమత్తులో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.


Read More
Next Story