హిమాచల్ లో 123 ఏళ్ల లో మూడోసారి మాత్రమే ఇలా నమోదు అయింది? ఏంటదీ?
కొండ ప్రాంతాలతో అత్యంత అందంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ లో 123 ఏళ్లలో మూడో సారి ఓ రికార్డు నమోదు అయింది. ఇలాంటివి ఇక్కడ నమోదు కావడం చాలా అరుదు..
By : The Federal
Update: 2024-11-02 10:23 GMT
వాతావరణ మార్పుల ప్రభావం హిమాలయాలపై ఎలా పడుతున్నాయో చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి సంఘటనే మరోసారి హిమాచల్ ప్రదేశ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. రాష్ట్రంలో 123 సంవత్సరాలలో మూడవ అత్యంత అల్ప వర్షపాతం నమోదైన నెలగా ఈ అక్టోబర్ నిలిచింది.
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ మొత్తం లో వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాలు పొడి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఇలాంటివి మనకు సాధారణమే కానీ హిమాలయ ప్రాంతాల్లో అత్యంత అరుదు. ఈ అక్టోబర్ లో రాష్ట్రంలో కేవలం 97 శాతం మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు అయింది. ఈ నెలలో 25. 1 మిలిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 0.7 శాతం తక్కువగా కురిసింది.
డేటా ప్రకారం, హమీర్‌పూర్, బిలాస్‌పూర్, సోలన్, సిర్మౌర్, కులు, చంబాలో 100 శాతం, సిమ్లా, లాహౌల్-స్పితిలో 99 శాతం, కిన్నౌర్‌లో 98 శాతం, కాంగ్రాలో 94 శాతం, మండిలో 83 శాతం, ఉనాలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని వాతవరణ శాఖ వెల్లడించింది.
చాలా రోజులలో బలహీనమైన వర్షపాతం కారణంగా, హిమాచల్ ప్రదేశ్ 1901 నుంచి అక్టోబర్ నెలలో మూడవ అత్యల్ప వర్షపాతాన్ని పొందింది. అక్టోబర్ నెలలో అత్యధికంగా 1955లో 413.5 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదే సమయంలో లాహౌల్-స్పితిలోని కోక్సర్ అక్టోబర్ 9 - 10 తేదీలలో మంచు జాడలను అందుకుంది. కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసినప్పుడు అక్టోబర్ 6 మినహా చాలా రోజులలో వాతావరణం ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా పొడిగా ఉంది. స్థానిక వాతావరణ ఆఫీస్ ప్రకారం, లాహౌల్-స్పితిలోని టాబోలో గత 24 గంటల్లో మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హమీర్‌పూర్‌లో అత్యధికంగా 35.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న ఏడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకే రాష్ట్రంలో రెండు రకాల వాతారణ పరిస్థితులు సైతం ఏర్పడటంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.