కశ్మీరీ పండిట్ల రాక కోసం భారీ ప్రచార కార్యక్రమం

‘మహా అభియాన్ ఆహ్వాన్-2026’ కింద దేశవ్యాప్త ప్రచారం, తమ మాతృభూమిలో స్వేచ్ఛగా ఉండే హక్కు కావాలంటున్న పండిట్లు

Update: 2025-11-20 07:12 GMT

1990 దశకంలో కశ్మీర్ లోయలో సంభవించిన ఇస్లామిక్ మతోన్మాదం కారణంగా స్థానభ్రంశం చెందిన కశ్మీరీ పండిట్లను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకురావాలని భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక మాతృభూమి ఏర్పాటును సమర్థించే ‘యూత్ ఫర్ పనున్ కశ్మీర్’ బుధవారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రకటించింది. గత 35 ఏళ్లుగా సాగుతున్న పోరాటంలో అత్యంత నిర్ణయాత్మక నాగరిక సమీకరణగా ఈ కార్యక్రమాన్ని సదరు సంస్థ పేర్కొంది.

‘మహా అభియాన్ ఆహ్వాన్ 2026’ అనే ప్రచారం జనవరి 16, 2026 న జమ్మూలోని స్థానభ్రంశం చెందిన కశ్మీరీ పండిట్ల అతిపెద్ద వలస శిబిరం నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

‘‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఆవిర్భావం కారణంగా కశ్మీర్ లోయ నుంచి మేము వలస వెళ్లి ముప్పై ఐదు సంవత్సరాలు గడిచాయి. జనవరి 16న శరణార్థుల శిబిరమైన ‘జగ్తి’ శిబిరం నుంచి మహా అభియాన్ ఆహ్వాన్ 2026 ను ప్రారంభిస్తున్నాము.
35 ఏళ్లుగా నిరాశ్రయులైన కశ్మీరీ హిందువుల పోరాటంలో ఇది అత్యంత నిర్ణయాత్మక సమీకరణ అవుతుంది’’ అని అపెక్స్ కమిటీ చైర్మన్ రాహుల్ కౌల్ అన్నారు.
ఈ ప్రచారాన్ని జాతి నిర్మూలన కోసం ప్రయత్నించిన సందర్భంలో స్థానభ్రంశం చెందిన ప్రజల రాజీలేని పునర్జువనాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. ‘‘ఇది మార్గదర్శన్ ఆదేశం, భారత్ తన రాజ్యాంగ బాధ్యతతో స్థానభ్రంశం చెందిన పౌరులతో బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తోంది’’ అని కౌల్ అన్నారు.
మార్గదర్శన్ ఆదేశం 1991 నాటి మార్గదర్శన్ తీర్మానాన్ని సూచిస్తుంది. ఇది పానున్ కశ్మీర్ ఉద్యమాన్ని ప్రధాన సైద్దాంతిక, రాజకీయ మార్గదర్శిగా పనిచేస్తుంది.
మహా అభియాన్ ఆహ్వానం 2026 అనేది ఒక ప్రతీకార సంఘటన కాదని, నాగరిక పిలుపు అని నాయకులు అన్నారు. కశ్మీరీ హిందువులు వారి మాతృభూమిలో అధికారికంగా పునరావాసం కల్పించే ప్రక్రియ వెంటనే ప్రారంభించకపోతే ఉద్యమం న్యాయం, గౌరవం ఆధారంగా వేరే మార్గాల్లోకి పోరాటం మారుతుందని హెచ్చరించారు.
కశ్మీరీ హిందువులు తిరిగి రావడం ఇప్పుడు గౌరవప్రదంగా, ప్రాదేశికంగా, శాశ్వతంగా, భద్రతకు హమీ ఇవ్వాలి. మాతృభూమి కోసం మన సమష్టి ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలి, రాజీ ఉండకూడదు, ఆలస్యం ఉండొద్దని చౌదరి అన్నారు.
‘‘జగ్తి నుంచి పుర్ఖూ, ముతి, నగ్రోటా అంతకుముందు ఉన్న అన్ని వలస కేంద్రాలు ఇప్పుడు ఒకే మాట మాట్లాడుతున్నాయి’’ అని జనరల్ సెక్రటరీ దిగంబర్ రైనా అన్నారు. ‘‘జాతి హత్యను తిరస్కరించలేము. చర్చించలేము, తగ్గించలేము, ఇది గుర్తింపు, న్యాయం, తిరిగి రావడానికి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ ను కోరుతోంది’’ అని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేశ్ కచ్రూ చెప్పారు.
Tags:    

Similar News