‘అనాథ శవాలను అమ్ముకునే ప్రిన్సిపల్
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేశవ్యా్ప్తంగా సంచలన సృష్టించిన ఈ ఘటనలో ఆయన కీలకంగా మారారు. గతంలో ఆయన చేసిన దారుణాలపై కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఇటీవల నోరువిప్పారు. రాజకీయ నాయకులతో ఉన్న సత్సంబంధాల కారణంగా గతంలో సందీప్ అవినీతి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితంలేదని అలీ చెప్పారు. దీంతో సందీప్ గురించి సీబీఐ కూపీ లాగుతోంది. ఆయన గురించి తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తోంది.
వాటిని రీ సైక్లింగ్ చేయించే అమ్ముకునేవాడు..
‘అనాథ శవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకునేవాడు. ఆసుపత్రి చేపట్టే పనుల్లో 20 శాతం కమీషన్ ఆశించేవాడు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పాస్ చేయించేవాడు. గ్లౌజులు, సిరంజీలను రీ సైక్లింగ్ చేయించి వాటిని బంగ్లాదేశ్ వ్యాపారులకు అమ్ముకునేవాడు. 2023లో ఘోష్ చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి విజిలెన్స్ విభాగానికి తెలిపినా ఏ చర్య తీసుకోలేదు’ అని అలీ తెలిపారు.
అలీ వ్యాఖ్యల నేపథ్యంలో సందీప్ ఆర్థిక లావాదేవీలు, అవకతవకలపై సిట్ విచారణ ప్రారంభమైంది. జనవరి 2021 నుండి ఇప్పటి వరకు ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతుంది.
ఆర్థిక లావాదేవీలపై విచారణ?.
ఘోష్ ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తో విచారణ జరిపించాలని అలీ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
అలీ పిటీషన్‌కు జస్టిస్ రాజర్షి భరద్వాజ్ అంగీకరించారు. సందీప్ సీబీఐ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో ఆయనకు పాలిగ్రాఫ్ పరీక్ష చేయించే అవకాశం ఉంది.