చీకట్లో ఎన్టీఆర్ విగ్రహం కూల్చే ప్రయత్నం

చిత్తూరు జిల్లాలో రోడ్డు రిపేర్ కు అడ్డు వస్తున్నదని ఎన్టీఆర్ విగ్రహాన్ని రాత్రి గుట్టుచప్పుడు కాకుండా తొలిగించే ప్రయత్నం విఫలమయింది. వివరాలు

Update: 2023-12-30 02:07 GMT

తిరుపతి నియోజకవర్గం తిమ్మి నాయుడు పాళ్యం కూడలిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు  ఎన్టీ రామారావు  విగ్రహాన్ని 29వ తేదీ రాత్రి 7-00సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించే ప్రయత్నం చేశారు. దీనితో గొడవ జరిగింది. టిడిపి నేతలు విగ్రహాన్ని చేరుకుని ధర్నా చేశారు.నినాదాలు చేశారు. కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

రాత్రి చీకట్లో. ఆ దారిలో ఎవరి అలికిడి లేని సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని  స్థానికులు గమనించారు. ఇది చిన్న అలజడి సృష్టించింది. వెంటనే ఈ సమాచారం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయానికి చేరింది.

 



తిరుపతి పార్లమెంటరి నియోజకవర్గం అధ్యక్షులు గొల్ల నర్సింహయాదవ్ , పార్టీ నేతలతో కలిసి తిమ్మినాయుడి పాలెం చేరుకొని ఈ విగ్రహం కూల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చాలాసేపు నినాదాలుచేశారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు బైఠాయించి ధర్నా చేశారుు. విగ్రహానికి చుట్టూ ఉన్న ఇనుప నట్లు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారుు.  రాత్రి పూట ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందో కమిషనర్ చెప్పాలని కమిషనర్ కు ఫోన్ చేసి డిమాండ్ చేశారు

రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి నియోజకవర్గ పర్యటనలో తిమినాయుడుపాలెం ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్బానికి గుర్తుగా తిమ్మినాయుడి పాలెం ప్రజలు, అభిమానులు కలిసి  నందమూరి తారకరామరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అటు తరువాత కొంతకాలానికి విగ్రహం కొంతమేర పాతబడి పోవడంతోర 2023 వ సంవత్సరం మే నెలలో రామారావు శత జయంతి దినోత్సవ సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఆధ్వర్యంలో నూతన విగ్రహ ఆవిష్కరణ జరిగింది.

ప్రస్తుతం తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లు పనులకు ఈ విగ్రహం అడ్డుగా ఉన్నదని అధికారులే తొలగించే ప్రయత్నం చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందని భావించి రాత్రి పూట విగ్రహం గుట్టు చప్పుడు కాకుండా తొలిగించే ప్రయత్నం చేశారు. పార్టీ నాయకులు గానీ ఎవరికి గాని ఎటువంటి సమాచారం లేకుండా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడానికి ప్రయత్నం చేశారు.

ఈ విషయాన్ని గొల్ల నరసింహ యాదవ్ కమిషనర్ కి ఫోన్ చేసి అసమ్మతి తెలిపారు. ఇలా రాత్రిరాత్రి విగ్రహం తొలగించాలనుకోవడం పట్ల నిరసన తెలిపారు. అయితే,

ఆ విగ్రహాన్ని అవమాన పరిచే విధంగా ఎలాంటి చర్యలు ఉండవని కమిషనర్ హామీ ఇచ్చారు.

విగ్రహాన్ని ఏర్పాటుకు సరైన స్థలాన్ని ఎంపిక చేసి, ఎలాంటి సమస్యలేకుండా ప్రతిష్టించాలని టిడిపి నేతలు కోరారు.

Tags:    

Similar News