ఆంధ్ర ఎన్నికల ప్రచారాలు మంగళవారం ఇలా

ఆంధ్రలో ఎన్నికల ప్రచార వేడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు ప్రచారాల్లో కూడా పోటీ పడుతున్నాయి. ఆయా పార్టీల ప్రచారాలు ఈరోజు ఇలా..

Update: 2024-04-23 03:15 GMT

ఆంధ్రలో ఎన్నికల వేడి పెరిగిపోతోంది. సమ్మర్ హీట్‌ను కూడా బీట్ చేస్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తమ జెండాను, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొత్తకొత్త వ్యూహాలు రచిస్తోంది. వాటన్నింటితో పాటు తమ వాగ్దానాలు, ప్రత్యర్థులపైన విమర్శలతో ప్రజల నోళ్లలో నానడానికి తెగ ప్రయాస పడుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే ఆయా పార్టీలు జోరుగా యాత్రలను చేస్తున్నాయి. ఈరోజు ఆయన యాత్రలు ఎలా సాగనున్నాయంటే..

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమై మధురవాడ, ఆనందపురం చేరుకుంటారు. అక్కడ స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత చర్చించి ప్రచార వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తగరపువలస మీదుగా జొన్నవాడ చేరుకుంటారు. అక్కడే భోజన విరామం. విరామం ముగిసిన వెంటనే యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్లలం మీదుగా అక్కివలస చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు బాపట్లలో కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చీరాల చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్న వైఎస్ షర్మిల. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బాపట్ల చేరుకుంటారు. అక్కడ రెండో బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు తెనాలి చేరుకుని అక్కడ ఈరోజు నిర్వహించే మూడు సభలో పాల్గొంటారు.

జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ప్రచారం ఈరోజు పిఠాపురంలో సాగనుంది. ఈరోజు ఆయన పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఆయన పలు నియోజకవర్గాల్లో పర్యటించి, ఓ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News