మీకు అండగా కాంగ్రెస్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రలు, సన్నిహతులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు పీసీసీ ఛీప్ షర్మిలరెడ్డి. అన్న విస్మరిస్తే చెల్లెలు వారిని పలకరిస్తున్నారు.

Update: 2024-01-31 08:02 GMT
దుట్టా రామచంద్రరావుతో వైఎస్ షర్మిల

నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డలాంటి దాన్ని. నాన్నకు మీరు ఎంత మంచి ఆప్తమిత్రులో నాకు తెలుసు. అందుకే మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నా అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల పలువురు వైఎస్ఆర్ అభిమానులను కలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పర్యటనలో ఆమె నలురుగు ముఖ్యులను కలిసారు. వీరందరినీ పార్టీలోకి తీసుకునేందుకు నిర్ణయించారు. వారిని త్వరలోనే పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్దమైంది. పార్టీలో సీనియర్ నాయకులు ఉండటం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈఆలోచన షర్మల చేసిందా? లేక ఢిల్లీ నుంచి పార్టీ అధిష్టానం చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ఏమైనా పార్టీకి ఉపయోగపడే కార్యక్రమం కావడం వల్ల పార్టీ అధిష్టానం కూడా షర్మిలకు మంచి ప్రోత్సాహం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నది.


Delete Edit


పట్టించుకోని జగన్

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న వారిని వైఎస్సార్సీపీలోకి పిలవాలని వైఎస్ జగన్ ఎప్పుడూ భావించలేదు. ఎవరైనా వారంతకు వారు వస్తే పార్టీలోకి తీసుకున్నారు తప్ప వారిని పిలవలేదు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరారు. జగన్ ఆలోచనా సరళి నచ్చని కొందరు సీనియర్ నేతలు పార్టీ నుంచి తప్పుకున్నారు. అయినా వారిని తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం కానీ, వారితో మాట్లాడటం కానీ చేయలేదు. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గం నుంచి డాక్టర్ దుట్టా రామచంద్రరావును మొదట అందరూ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అందరూ ఊహించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. పైగా ఆయన మాటలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దుట్టా డాక్టర్ వైఎస్సార్ కు మంచి స్నేహితుడు. నీతిపరుడనే పేరు కూడా వుంది. అటువంటి వ్యక్తిని వదులుకోవడం ఎందుకని కొందరు చెప్పినా అవేమీ పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లోనూ యార్లగడ్డ వెంకట్రావుకు వైఎస్సార్సీపీ టిక్కెట్ కేటాయించింది. అప్పుడు దుట్టా కూడా వెంకట్రావుకు సపోర్టు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ కూడా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. దంతో వెంకట్రావు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దుట్టా రామచంద్రరావు వైఎస్సార్సీపీని వీడారు. అటువంటి వ్యక్తి వద్దకు వెళ్లిన షర్మిల నాకు మీ సపోర్టు కావాలని అడిగారు. కానీ జగన్ వైఎస్ సన్నిహితులు, అభిమానులను దూరం చేసుకున్నారు. కారణాలు ఏమిటనేది ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్నలుగానే చెప్పొచ్చు.


Delete Edit

త్వరలో కాంగ్రెస్ లోకి వైఎస్ సన్నిహితులు

వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ ఏ పార్టీలో చేరకుండా ఉన్న వారిని షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఎప్పుడు పిలిచినా చేరుతామని చెబుతున్నారు. త్వలోనే వీరందరినీ ఒకచోటుకు పిలిపించి కానీ, నేరుగా వారి వద్దకు వెళ్లి కానీ పార్టీలో చేర్చుకునే అవకాశం వుంది. విశాఖపట్నంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, హనుమాన్ జంక్షన్ లో డాక్టర్ దుట్టా రామచంద్రరావు, కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజీపేటలోని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని వారి నివాసాల్లో కలిసారు. వారితో కాసేపు మాట్లాడారు. వైఎస్సార్ బిడ్డగా మీదగ్గరకు వచ్చాను, నన్ను ఆశీర్వదించండని చెప్పడం విశేషం. వారి మద్దతు కోనిన షర్మిల వారిని త్వరలోనే పార్టీలోకి తీసుకు రానుంది.

Tags:    

Similar News