అసెంబ్లీలో కాంగ్రెస్ బోణి, పార్టీలో చేరుతున్న మొదటి ఎమ్మెల్యే
కలొసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు తయారయింది ఆంధ్ర కాంగ్రెస్ అదృష్టం. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా ఇపుడు ఒక ఎమ్మెల్యే దక్కుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు అదృష్టం కలిసొస్తున్నట్లే ఉంది. పార్టీకి ఒక ఎమ్మెల్యే దక్కుతున్నాడు. అంటే, కాంగ్రెస్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఇటీవల వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి (ఆర్ కె) కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయాన ప్రటించారు.
నిజానికి ఆయన అసెంబ్లీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే,స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఆయన కు టికెట్ కు ఇవ్వకూడదని పార్టీ అధినేత నిర్ణయించడంతో, నాయకత్వ దోరణినికి నిరసనగా పార్టీకి, అసెంబ్లీసభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.
ఆయన ఏ పార్టీలో చేరతారో ఇంత వరకు ప్రకటించలేదు. అయితే, ఆయన వైఎస్ షర్మిలతో పయనిస్తానని అంటూ వచ్చారు. ఇపుడాయన చాలా స్పష్టంగా తన రాజకీయ గమ్యమేమిటో చెప్పారు.
కవైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పార్టీ లో చేరబోతున్న వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన మంగళగిరిలో ప్రకటించారు.
అంతేకాదు, ఆంధ్ర ప్రదేశ్ నుంచి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మొదటి శాసన సభ్యుడిని కూడా తానేనని ఆయన చెప్పారు. పేర్కొన్నారు.
అదే సమయంలో ఆయన మరొక విషయం కూడా వెల్లడించారు. అది అమరావతి రాజధాని మీద తన వైఖరి. తాను అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని తెలిపారు, కేవలం రాజధాని కోసం బలవంతంగా జరిగిన భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని ఆర్ కె వెల్లడించారు.
అమరావతికి సంబంధించి వైసిపి నేతగా ఆయన తెలుగుదేశం అధ్యక్షుడి చంద్రబాబు నాయుడి మీద అనేక కేసులు కూడా వేశారు. ఇపుడు ఆయన తాను అమరావతికి వ్యతిరేకం కాదని ప్రకటించారు.
గురువారం నాడు న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరుతున్నారు.
కనీసం ఒక అరడజను శాసన సభ్యులు తొందరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఇక్కడి రాజకీయావర్గాల్లో వినబడుతూ ఉంది.