పంట నష్టంపై ఎవరు ఏమి చెప్పినా నమ్మొద్దు

తుపాన్‌ బాదిత రైతులతో పీపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Byline :  The Federal
Update: 2023-12-08 12:38 GMT
నీట మునిగిన పంటను పరిశీలిస్తున్న సీఎం జగన్‌

పంటనష్టానికి సంబంధించి ఎవరు ఏమి చెప్పినా రైతులు నమ్మొద్దు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"ఇన్సూరెన్స్‌ రాదంటే నమ్మొద్దు. ఈ ప్రభుత్వం మీ బిడ్డది. మనం మారీచుడితో యుద్ధం చేస్తున్నాం,"  అని    ఆయన అన్నారు.

ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నది లేనట్లు రాస్తున్నారు. ఇన్సూరెన్స్‌ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. ఏడాదిలో ఇన్సూరెన్స్‌ ఇచ్చామంటే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ ఖరీప్‌ ఇన్సూరెన్స్‌ వచ్చే జూన్‌లో ఇస్తాం. ఈ క్రాప్‌ నమోదు చేసి ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతున్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

బాపట్ల జిల్లాలోని మరుప్రోలువారిపాలెం, పాతనందాయిపాళెం గ్రామాల్లో జగన్ తుపాన్‌ రైతులను పరామర్శించి, పొలాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు పాలనలో కరువు తప్ప ఏముంది?
చంద్రబాబు పాలనలో ఐదేళ్లు కరువు, చంద్రబాబు ఇచ్చిన ఇన్సూరెన్స్‌ రూ. 3,500 కోట్లు మాత్రమే. నాలుగున్నర ఏళ్ల కాలంలో 55 లక్షల మందికి రూ. 7,500 కోట్లు ఇచ్చాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఈ సీజన్‌లో నష్టం జరిగితే ఈ సీజన్‌ ముగిసేలోగానే ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. టీవీల్లో, పత్రికల్లో ముఖ్యమంత్రి ఫొటోలు రావాలని ఫోజులిచ్చే వాడిని నేను కాదు. అది టీడీపీ వాళ్లకే చెల్లింది.
త్వరలో ఎన్యుమరేషన్‌ పూర్తి
ఎన్యుమరేషన్‌ త్వరలోనే పూర్తి చేసి సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా పెడతాం. ఎవరైనా మిస్‌ అయితే రీ వెరిఫికేషన్‌ చేసి తిరిగి వారికి సాయం అందిస్తాం. వచ్చే సంక్రాంతిలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తున్నాం. రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా ఆ సీజన్‌ ముగిసేలోపు ఇస్తున్నాం.
పంటలు వేసుకునే వారికి విత్తనాలు 80 శాతం సబ్సిడీతో ఇస్తున్నాం. రైతులను వెంటనే ఆదుకుంటాం. అపోహలు నమ్మొద్దు, ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దు. ఈటీవీ, ఏబీఎన్‌ చూడొద్దు. వీళ్లంతా అబద్దాలు చెబుతున్నారు. వాళ్లకు కావాల్సిన ముఖ్యమంత్రి లేరని దురుద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు.
సచివాలయ వ్యవస్థ గొప్పది
సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థ ఎంతో గొప్పది. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థ. మనకు ఓటు వేయని వారికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగ పడుతుంది. గ్రామ సచివాలయాల్లో వాళ్ల జాబితాలు పెట్టి సోషల్‌ ఆడిట్‌ చేయిస్తాం. ఎవరికైనా సాయం అందకపోతే మళ్లీ అడగొచ్చు. ఇల్లు, పొలాల్లోకి నీరు వచ్చిందో వాళ్లందరికీ రూ. 2,500 ఇస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. బాపట్ల జిల్లాలో దాదాపు 12వేల మందికి సాయం అందుతుంది. నిత్యావసర సరుకులు ఇస్తున్నాం.
మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ నష్టం జరిగినా మంచి జరిగేందుకు సోషల్‌ ఆడిట్‌ పెట్టి, జిల్లాల సంఖ్యను పెంచి జిల్లాకు ఇద్దరు కలెక్టర్‌ను పెట్టి, సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థలు తీసుకొచ్చి ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా కలెక్టర్‌కు సరైన సమయం ఇచ్చి, నేనే వచ్చి ప్రజలను అడిగి తెలుసుకుంటా. కలెక్టర్‌ల వద్ద డబ్బులు ఉంచి వ్యవస్థను యాక్టివేట్‌ చేసి ముందుకు నడిపిస్తున్నాం.
జరిగిన నష్టం అపారమైనది. చేయాల్సిన సాయం ట్రాన్ఫరెంట్‌గా వేగంగా జరుగుతుంది. గత ప్రభుత్వాలకంటే మిన్నగా సాయం అందిస్తాం. టెంపరీ కార్యక్రమాలు వెంటనే చేపట్టి, పర్మినెంట్‌ కార్యక్రమాలు త్వరలోనే చేపడతామని ముగించారు. అనంతరం ప్రజతో మాట్లాడి సమస్యలపై కలెక్టర్‌ పి రంజిత్‌బాషాకు అక్కడికక్కడే ఇన్‌ స్ట్రక్షన్స్‌ ఇచ్చారు.


Tags:    

Similar News