జగన్‌పై మాజీలు అటాక్‌

జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలు తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ వీడిన నాయకుల్లో కలకలం రేపుతున్నాయి.;

Update: 2025-02-07 11:09 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద మాజీల అటాక్‌ మొదలైంది. ఇదింకా పెరిగే అవకాశం ఉంది. వారి చేత కూటమి వర్గాలు అలా మాట్లాడించే చాన్స్‌ ఉందని టాక్‌ వినిపిస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారి మీద జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మాజీల్లో కలకలం రేపుతోంది. కూటమి వర్గాల్లో కూడా జగన్‌ వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో దీంతో ఒక్కొక్కరుగా జగన్‌ వ్యాఖ్యల మీద స్పందిస్తున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి.. జగన్‌ వ్యాఖ్యలకు బదులివ్వగా.. అదే వరుసలో మరో ఇద్దరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన మాజీ నేతలు స్పందించారు. మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు రియాక్ట్‌ అయ్యారు.

మోపిదేవి వెంకటరమణ ఏమన్నారంటే..
గురువారం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బదులిచ్చారు. తాను ప్రలోభాలకు.. ఒత్తిళ్లకు లొంగే వ్యక్తినో.. ఒత్తిళ్లకు లొంగే వ్యక్తిని కాదో అనే విషయం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన అంతరాత్మకే తెలుసని వ్యాఖ్యానించారు. ఒక వేళ్ల తాను ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగే వ్యక్తినే అయితే జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కునే వాడిని కాదని, అలా ఇరుక్కుని జైలుకు వెళ్లే వ్యక్తినే కాదని వ్యాఖ్యానించారు.
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను వీడిన మరో మాజీ నేత కూడా గురువారం జగన్‌ చేసిన వాఖ్యల మీద రియాక్ట్‌ అయ్యారు. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీని వీడిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తీవ్రంగానే స్పందించారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు జగన్‌మోహన్‌రెడ్డికి లేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి నైజం, అహంకారం నచ్చకనే ఎంతో మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారని, మరెంతో మంది వీడుతున్నారని, జగన్‌మోహన్‌రెడ్డి నైజం, అహంకారం నచ్చకనే తాను కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడానని వ్యాఖ్యానించారు.
మరో మాజీ నేత, వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నేతగా వెలుగొందిన వ్యక్తి, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. జగన్‌మోహన్‌రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయా వర్గాల్లోను, ఇటు వైఎస్‌ఆర్‌సీపీ, కూటమి వర్గాల్లోను సంచలనంగా మారాయి. తాను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్‌ ఉన్న వ్యక్తిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పారీ పదవులను, రాజకీయాలను వదులుకున్నా అంటూ వ్యాఖ్యానించారు.
జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఏమన్నారంటే..
తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డితో కలిపి ముగ్గురు పోయారు. బేసికల్లీ.. పార్టీని వీడే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట చెబుతున్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు.. క్యారెక్టర్‌ ఉండాలి. క్రెడిబులిటీ అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్‌ ఎగరేసుకొని చెప్పాలి. పలానా వ్యక్తి మా నాయకుడు అని. ముఖ్యమంత్రి అయినా సరే. ఎమ్మెల్యే.. ఎంపీ.. ఎలాంటాయనైనా సరే. ఎవరి గురించైనా ఇలా గొప్పగా చెప్పుకోవాలి. కానీ మనమంతట మనమే ప్రలోభాలకి లొంగో.. భయపడో.. ఏదో ఒక కారణం చేత మనమంతట మనమే మన క్యారెక్టర్‌ని, మన క్రెడిబులిటీని మనం పణంగా పెట్టి.. మనం కాంప్రొమైజ్‌ అయ్యి.. అటువైపునకు మనం పోతే.. మనకు గౌరవం ఏముంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్‌ ఏంది? మన క్రెడిబులిటీ ఏంది? ప్రతి ఒక్కరు రజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచనలు చేసుకోవాలి. ఈ కష్టమన్నది ఎల్ల కాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే ఫైవ్‌ ఇయర్స్‌. మాగ్జిమమ్‌ నీకేదన్న కష్టం ఉంటే అది ఫైవ్‌ ఇయర్స్‌. ఫైవ్‌ ఇయర్స్‌ యు కెన్‌ జస్ట్‌ హోల్డ్‌ ఆన్‌. దెన్‌ యువర్‌ టైమ్‌ విల్‌ కమ్‌. క్యారెక్టర్‌ను, క్రెడిబులిటీని నమ్ముకొని నిలబడాలి. అది సాయిరెడ్డికైనా.. పోయిన ముగ్గురి ఎంపీలకైనా అంతే. ఇంకా పోతారని చెబుతున్న ఒకరో ఇద్దరో.. వాళ్లకైనా అంతే అంటూ పార్టీని వీడిన, వీడబోతున్న వారి గురించి చెబుతూ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News