ఫిబ్రవరి 5న ఫీజు రియింబర్స్‌మెంట్ పోరు బాట
విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. వసతి దీవెన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్లతో వైసీపీ ధర్నాలు చేపట్టనుంది.;
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వం పోరు బాట కార్యక్రమాలకు సిద్ధం కావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇది వరకే పిలుపు ఇచ్చారు. రైతుల సమస్యలు, కరెంటు చార్జీలు, ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి కీలక అంశాలపై పోరుబాటకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. అయితే ఇది వరకే రైతుల సమస్యలు, కరెంటు చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ సారి ఫీజు రియంబర్స్‌మెంట్ మీద పోరు బాట చేపట్టాలని నిర్ణయించారు. దీని కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనే విధంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు రియంబర్స్‌మెంట్‌పై పోరుబాట చేపట్టేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళనలు చేపట్టనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు దిగనున్నారు. విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు అధికారులు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా.. విద్యార్థులకు సంబందించిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ఇంత వరకు విడుదల చేయలేదు. దీంతో పాటుగా విద్యార్థులకు ఫీజులు కూడా ఇంత వరకు చెల్లించ లేదు. దీంతో విద్యా సంస్థలకు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయి.