పవన్ కళ్యాణ్‌కు ఫుల్ పబ్లిసిటీ
పవన్ కళ్యణ్ ఎక్కడికి విజిట్‌కు వెళ్లినా ఆయన మాటలు సంచలనంగా మారుతున్నాయి. ఒక విధంగా ప్రభుత్వాలనే ఆయన తప్పుపడుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తనదైన శైలిలో అడుగులు ముందుకు వేస్తున్నారు. మూడు నెలలుగా కాకినాడ పోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. మీరు వెళితే వేల మంది పనివాళ్లకు పొట్టకొట్టినట్లైందంటూ ఆపివేస్తున్నారు. ఇదేమిటని చాలా రోజులు ఆలోచించా. ఇవ్వాళ వెళదామనుకున్నా. ఎవరు చెప్పినా వినలేదు. వచ్చా... చూస్తే కాకినాడ పోర్టు దొంగరవాణాకు కేంద్రంగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమయంలో డ్రోన్ కెమెరా పోర్టులోని ఓడలు, వాటిల్లో ఉన్న సరుకు, ఇతర వస్తువులు కళ్లకు కట్టినట్లు చూపించింది. ముందు రోజు ఎక్కడైతే జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ వెళ్లి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారో అక్కడి వరకు ఓడలో వెళ్లి పరిశీలించారు. అక్కడికి వెళ్లేందుకు ముందు అధికారులు వద్దన్నారు. అయినా వెళ్లి రావాల్సిందేనంటే తీసుకెళ్లారు. వెళ్లిన తరువాత ఓడ చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఓడలోకి ఎక్కనివ్వడం లేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఒక ఉప ముఖ్యమంత్రికే ఇక్కడ దిక్కులేకుండా ఉందని వ్యాఖ్యానించారు.