శారదా పీఠానికి జగన్‌ స్థలం ఇచ్చాడు.. చంద్రబాబు వెనక్కి తీసుకున్నాడు

గత జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-19 10:53 GMT

సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీలో ప్రముఖ పీఠంపై జగన్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. విశాఖపట్నం శారద పీఠానికి జగన్‌ ప్రభుత్వం కేటాయించిన స్థలం అనుమతులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

జగన్‌ ప్రభుత్వం విశాఖలో శారద పీఠానికి 15 ఎకరాల స్థలం ఇచ్చింది. దీని విలువ రూ. 220 కోట్లు అయితే కేవలం రూ. 15లక్షల నామమాత్రపు ధరకు జగన్‌ ప్రభుత్వం శారద పీఠానికి ఇచ్చింది. దీనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పుబట్టింది. దీనిపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక ప్రకారం తాజాగా ఆ స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఆగని ప్రభుత్వం శారద పీఠానికి సంబంధించి మరొక నిర్ణయం కూడా తీసుకుంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శారద పీఠం చేపట్టిన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఆ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. మొత్తమ్మీద శారద పీఠానికి సంబంధించిన జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ, దానికి సంబంధించిన అనుమతులను రద్దు చేయడం గమనార్హం.

Tags:    

Similar News