కళ్యాణదుర్గం నుంచి కాపు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ మద్దతు లభించిందని ఆయన సన్నిహతులు చెబుతున్నారు.

Update: 2024-01-29 08:40 GMT
Kapu Ramachandra Reddy MLA

అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఈమేరకు తన సీటు కూడా రిజర్వు చేసుకున్నారు. కాపు రామచంద్రారెడ్డికి రాయదుర్గం సీటు లేదని వైఎస్సార్సీపీ ఇటీవల ప్రకటించించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కాపు రామచంద్రారెడ్డి తాను కళ్యాణదుర్గం నుంచి, తన భార్య రాయదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉంటామని ప్రకటించి సంచలనం సృష్టించారు. మొదట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆతరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాయదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొదటి నుంచీ స్థానిక ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నారు. సర్వేల ఫలితంగా రామచంద్రారెడ్డికి సీటు లేకుండా పోయింది. దీంతో ఆయన వైఎస్సార్సీపీని వీడారు. ఎప్పటి నుంచో తనకు గురువుగా ఉన్న ఏపీసీసీ మాజీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి వద్దకు వెళ్లారు. ఆసీస్సులు తీసుకున్నారు.

షర్మిల రావడం కలిసొచ్చింది

ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మల బాధ్యతలు తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్తరక్తం వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చాయని చెప్పొచ్చు. ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఆమెను కాపు కలిసినట్లు సమాచారం. సుమారు 20 ఏళ్ల నుంచి కాపు రామచంద్రారెడ్డికి వైఎస్సార్ కుటుంబంతో బాంధవ్యం వుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీటు రామచంద్రారెడ్డికి కన్ఫామ్ చేస్తున్నట్లు ఇప్పటికే రఘువీరారెడ్డి మాటిచ్చారని సమాచారం. నిజానికి కళ్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి పోటీ చేయాల్సి వుంది. వేరే కారణాల వల్ల ఆయనకు మరో అవకాశం రావడంతో కళ్యాణదుర్గం నుంచి రఘువీరా పోటీ చేయడం లేదని సమాచారం. దీంతో కాపు రామచంద్రారెడ్డకి లైన్ క్లియరైందని పలువురు కాంగ్రెస్ వారు చెబుతున్నారు.

అన్నవైఎస్ జగన్ తో విభేదించిన చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్ కావడంతో రామచంద్రారెడ్డికి కలిసొచ్చినట్లు చెబుతున్నారు. కళ్యాణదుర్గంలో మొదటి నుంచీ పోటీ చేయాలనే ఆలోచనలో రామచంద్రారెడ్డి ఉన్నా జగన్ మొదట్లో టిక్కెట్ రాయదుర్గంకే ఇచ్చారు. దంతో కళ్యాణదుర్గంలో పోటీ చేయాల్సి వచ్చింది.

తన సత్తా ఏమిటో జగన్ కు చూపించాలి

ఎలాగైనా కళ్యాణదుర్గంలో గెలిచి జగన్ కు తన సత్తా చూపించాలనే ఆలోచనలో కాపు రామచంద్రారెడ్డి వున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కళ్యాణదుర్గం ఆయన సొంత నియోజకవర్గం కావండంతో ఎక్కువగా సేవా కార్యక్రమాలు మొదటి నుంచీ చేపట్టారు. ఇది ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డికి కలిసొస్తుందని పలువురు కాపు రామచంద్రారెడ్డి అభిమానులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఎవరిని అభ్యర్థిగా పెట్టినా కాపు చేతిలో ఓటమి చవిచూడాల్సిందేనని, వైఎస్సార్సీపీ అభ్యర్థి సమీప ప్రత్యర్థితో కూడా వుండే అవకాశం లేదని పలువురు కాపు అభిమానులు చెబుతున్నారు. ఏమైనా కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం నుంచి గెలుపు సాధించాలంటే తప్పనిసరిగా రఘువీరారెడ్డి మద్దతు కావాల్సి ఉంటుంది. ఎన్నికలసమయంలో కనీసం రెండు సార్లైనా కాపు రామచంద్రారెడ్డికి మద్దతుగా రఘువీరా ప్రచారం చేయాల్సి వుంటుందని, అది జరిగితే కాపు రామచంద్రారెడ్డి తప్పకుండా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అభిమానులు.

Tags:    

Similar News