ఉగ్ర దాడుల బాధ గుండెల్లో ఉన్నా మోదీ అమరావతి వచ్చారు
మరో సారి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబును తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తారు.;
కశ్మీర్‌లో దారుణంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 27 మంది భారతీయులు చనిపోయారు. ఇది దేశాన్ని కలిచివేసింది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో బాధ ఉంది. ఎంతో ఆవేదన ఉంది. ఈ దుర్ఘటనతో ప్రధాని మోదీ ఎంతో వేదనకు గురయ్యారు. అయినా ఆ బాధలను, ఆ వేదనలను ప్రధాని మోదీ తన గుండెల్లోనే దిగమింగుకున్నారు. భారత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ ఇంటిగ్రిటీని చాటి చెబుతున్నారు. అంతటి తీవ్ర దుఃఖాన్ని తన గుండెల్లో దిగమింగుకొని అమరావతికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని గుర్తించి ఇక్కడకు వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిపై ప్రధాని మోదీకి ఉన్న ఇష్టానికి నిదర్శనం అన్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం సభలో శుక్రవారం పవన్ కల్యాణ్ మాట్లాడారు.