నాగబాబు ఎమ్మెల్సీ అయినట్లే..ఇక మంత్రి పదవే తరువాయి
ఎన్నికలకు ముందు నుంచి నాగబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికి నెరవేరింది.;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారా? ఇవ్వరా? అనే ఉత్కంఠకు ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా నాగబాబు ఎమ్మెల్సీ పదవిపై కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఎమ్మెల్సీ ఇవ్వక పోవచ్చు, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా ఇస్తారనే చర్చలు జరిగాయి. వాటన్నింటికీ ముగింపు పలుకుతూ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ బుధవారం ప్రకటించారు. జనసేన పార్టీకి నాగబాబు ఎనలేని సేవలు అందించారని, ఆ మేరకు నాగబాబును అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం అందించారు. నాగబాబు నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.