అన్నతో కాదు, చెల్లితోనే ఉంటా!

అన్నకు గుడ్ బై చెప్పాడు. చెల్లి పక్కన చేరబోతున్నారు. ఆమె నిర్ణయమే శిరోధార్యమంటున్నారు. చెల్లి క్రిస్మస్ కానుకను స్వీకరించిన చంద్రన్నను వదలనంటున్నారు..

Update: 2023-12-30 07:14 GMT
ఆర్.కే... షర్మిల (గ్రాఫిక్ ఫోటో)

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలియాస్ ఆర్కే.. ఇంకో మూడు నాలుగునెల్లు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటారు. ఈమధ్యనే తాను నమ్మిన, ఇంత కాలం పని చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా స్పీకర్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పుడాయన కొత్త పల్లవి అందుకున్నారు. “నేను అమ్మ షర్మిలమ్మతోనే ఉంటా” అని ఆర్కే తేల్చిచెప్పారు. దీంతో ఆయన చెల్లి పక్షమే గాని అన్న జగన్ పక్షం కాదని తేలిపోయింది. ఇప్పుడు ఒక్కో అస్త్రాన్ని జగన్ పై సంధించేందుకు సిద్ధం చేస్తున్నారు.

నేను ఏ పార్టీయో కాలమే నిర్ణయిస్తుంది...

రాజకీయాలు మనుషుల్ని నిర్వేదానికి గురి చేస్తాయా లేక మనుషులే రాజకీయాల్ని నిర్వీరం చేస్తాయా అనే చర్చ సుదీర్ఘ కాలంగా సాగుతోంది. ఇప్పుడు ఆర్కే వేదాంతం చూస్తుంటే.. తాను ఏపార్టీలో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందంటున్నారు. వైసీపీకి ఎంతో సేవ చేసినా అన్న జగన్ గుర్తించలేదని వాపోయారు. ‘నేను సర్వస్వం పోగొట్టుకున్నా. నేను వైఎస్ షర్మిలా వెంట నడుస్తా. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటా’ ఇదీ ఆర్కే మాట. షర్మిలను కలిశానని స్పష్టం చేసిన ఆర్కే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండబోతున్నారు. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలంటున్న ఆర్కే ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవనే అర్థం వచ్చేలా మాట్లాడడం ఒకింత విడ్డూరంగా ఉంది. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలనేది ఆర్కే సిద్ధాంతం.

మంగళగిరి ప్రజలు అభివృద్ధికే ఓటు...

మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన ఆర్కే తాను మంగళగిరికి ఏమీ చేయలేకపోయాననే ఆవేదన కూడా ఉంది. రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 120 కోట్ల రూపాయలను కూడా తేలేకపోయారు. ఎంతో చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోయారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదన్నది ఆర్కే ఆవేదన. కాంట్రాక్టర్లు ఒత్తిడి తెచ్చినా, సీఎంవోకు పదే పదే వెళ్లినా పని జరగలేదన్నది ఆయన బాధ.

అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చా...

ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వకపోయినా స్వయంగా 8కోట్ల రూపాయల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాననే ఆర్.రామకృష్ణారెడ్డి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయలేకే పార్టీని వీడినట్టు చెబుతున్నారు. ‘నా సొంత డబ్బుతో mtmc, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసా. లోకేMష్ ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా? నేను ఎవరిని నిందించడం లేదు. నాకు ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి చాలా సార్లు మేసేజీలు పెట్టారు.. నిధులు మంజూరు చేస్తానన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా నిధులు ఇంతవరకు రాలేదు” అనేది ఆర్కే మాట. రాజీనామాపై వెనక్కు తగ్గేదేలేదుంటున్న ఆర్కే ఆమోదించడం ఆమోదించకపోవడం వాళ్ల ఇష్టం, తానైతే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చారు. మంగళగిరి ప్రజలకు దూరంగా ఉండబోనని చెప్పే ఆర్కే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారంటూరు. తాను తన మాటకు కట్టుబడి ఉన్నానని, తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనంటున్నారు ఆర్కే.

చంద్రబాబుపై న్యాయ పోరాటం చేస్తా...

వైఎస్ జగన్, వైసీపీకి దూరంగా ఉంటానంటూ వైఎస్ షర్మిలకు దగ్గరవుతాననే ఆళ్ల రామకృష్ణా రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా, షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా పోరాటం ఆగదంటున్నారు ఆర్కే. తప్పు ఎవ్వరూ చేసినా తప్పే అనే ఆర్కే భవిష్యత్ లో వైసీపీ పై కేసు వేయడానికీ వెనుకాడనంటున్నారు. తనకు, ప్రస్తుత మంగళగిరి ఇంచార్జ్ జి.చిరంజీవికి, జగన్ కి మధ్య ఏమి జరిగింది అనేది త్వరలో బయటపెడతారేమో చూడాలి.

Tags:    

Similar News