ఎల్లలు దాటిన పవన్‌ కళ్యాణ్‌ ఆవేశం

దేశంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులకు మించి మాట్లాడుతున్న బిజేపియేతర నాయకుడు పవన్ కల్యాణే...

Update: 2024-10-31 05:57 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు కనిపిస్తున్నట్లు లేవు. తాగు నీరు లేక కలుషిత నీళ్లు తాగి డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఉన్నాయి. అధికారంలోకి రాక ముందు వీటి గురించిన మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌కు అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్వరమే కాదు, స్వరూపం కూడా మార్చుకున్నారు. సొంత రాష్ట్రంలోని సమస్యలను పక్కన పెట్టి సనాతనం, హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. వాటి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయనంటున్నారు. ఇప్పటి వరకు ఏపీలోని హిందువుల గురించి వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన పవన్‌ మాటలను ఇప్పుడు దేశ సరిహద్దులు దాటించారు. ముస్లిం దేశాల్లో నివసిస్తున్న హిందువుల గురించి ప్రార్థిద్దామని అంటున్నారు.

పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ దేశాల్లో నివసిస్తున్న హిందువులు అణచి వేతకు గురువుతున్నారు. వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వారికి ప్రాథమిక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. భద్రతతో పాటు ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్‌ ప్రపంచం, ప్రపంచ నేతలు కలిసి పని చేయాలని, ఆ దిశగా కలిసి పని చేస్తారని చేస్తారని తాను ఆశిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ మూడు దేశాల్లో ఉంటున్న హిందువుల కోసం మనమంతా ప్రార్థిద్దామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను పోస్టు చేసిన ట్వీట్‌కు ఒక బాలుడు పాడిన పాట లింక్‌ను జత చేశారు. ఈ చిన్నారి పాడిన పాటలో దేశ విభజన కారణంగా కలిగిన బాధ చాలా స్పష్టంగా కనిపించిందని పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కళ్యాణ్‌.. ఆ దేశాల్లో హిందువులు ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఆ శ్రీరాముడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంటూనే అక్కడున్న హిందువుల భద్రత, స్థిరత్వం కోసం భారత్‌లోని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

Tags:    

Similar News