దయచేసి రూమర్స్ ఆపండి ప్లీజ్..ఏఆర్ రెహమాన్ కుమార్తె రిక్వెస్ట్
ఎక్స్‌లో పోస్టు పెట్టనా ఫలితం కనిపించక పోవడంతో ఇన్‌స్టాలో స్పందించారు.;
By : The Federal
Update: 2024-12-08 07:51 GMT
ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్ గురించి, రెహమాన్ సినిమాల్లో మ్యూజిక్ చేస్తారా? చేయరా? అనే దాని గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాటిపైన రెహమాన్ కుమార్తె ఖతీజా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానిలో ఎలాంటి నిజం లేదని తొలుత ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. అయిన ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్‌పైన, సినిమాలకు ఆయన సీంగీతం సమకూరుస్తారా అనే దానిపైన సోషల్ మీడియాలో రూమర్స్, బ్యాడ్ ప్రచారం ఆగక పోవడంతో తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో దయచేసి అసత్య ప్రచారం ఆపండి ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేశారు.
ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు, దాదాపు 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బావోద్వేగా పరిస్థితుల్లో తాను ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఉండలేక పోతున్నానని, అందువల్ల తాను రెహమాన్ నుంచి విడాకులు తీసుకున్నట్లు రెహమాన్ సతీమణి సైరాబాను తరుఫున లాయర్ వెల్లడించారు. ఇది సినీ వర్గాలనే కాకుండా ప్రపంచ సంగీత ప్రియులు, ఏఆర్ రెహమాన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. తమ తల్లిదండ్రులు విడాకుల విషయాన్ని అర్థం చేసుకోవాలని నాడు రెహమాన్ కుమార్తెలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అయితే రెహమాన్ విడాకులను అర్థం చేసుకోకుండా రూమర్స్ ప్రచారం చేయడం మొదలెట్టారు నెటిజన్స్. విడాకుల నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్ ముగిసినట్లేనా? అని, ఇక సినిమాలకు సంగీతం సమకూరుస్తారా? మ్యూజిక్‌ను అందిస్తారా? విడాకుల బాధ నుంచి కోలుకునేందుకు ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారు వంటి రెహమాన్‌కు సంబంధించిన అనేక అంశాలపై సామాజిక మాధ్యమాల్లో రూమర్స్, అసత్య ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెహమాన్ కుమార్తె ఖతీజా స్పందించారు. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం రామ్‌చరణ్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్‌గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.