మెరుగుపడుతున్న సీతారాం ఏచూరి ఆరోగ్యం.. వెల్లడించిన సీపీఎం

సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సందిగ్దత నెలకొని ఉంది. ఆగస్టు 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు.

Update: 2024-09-06 06:51 GMT

సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సందిగ్దత నెలకొని ఉంది. ఆగస్టు 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయనను 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గురువారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటిన వెంటిలేటర్‌పై ఆయనను షిఫ్ట్ చేసినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపారు. దాదాపు ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కాగా శుక్రవారం ఉదయానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగుపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని ఎయిమ్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న రకరకాల ప్రచారాలతో ఆయన ఫాలోవర్స్ గందరగోళానికి గురవుతున్నారు.

అర్థంపర్థం లేని ప్రచారాలు..

సీతారాం ఏచూరి ఆరోగ్యం గురువారం విషయమించిందని, శుక్రవారం కాస్త మెరుగుపడిందని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. కానీ మరోవైపు మాత్రం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మంచి పేరున్న నేత కావడంతో ఆయన ఆరోగ్య విషయాన్ని ఎయిమ్స్‌ వారు సున్నితంగా డీల్ చేస్తున్నారని, కానీ వారి కుటుంబీకులకు మాత్రం సీతారాం ఏచూరి పరిస్థిస్థితి ఎప్పుడెప్పుడా అన్నట్లు ఉందని చెప్పారని ఒకవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ ప్రచారాన్ని దాటి మరో అడుగు ముందుకేసి సీతారాం ఏచూరి మరణించారని, ఆ వార్త చెప్పకుండా ఈ విషయాన్ని ప్రజల్లోకి మెళ్లిగా తీసుకెళ్లడానికి ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ రూమర్స్ తరహాలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, అందుకే ఆగస్టు 31 తర్వాత ఇప్పటివరకు ఆయన ఆరోగ్యంపై అధికారిక బులెటిన్ రాలేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.

ప్రచారాలను తోసిపుచ్చిన సీపీఎం

సీతారాం ఏచూరి ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలను సీపీఎం తోసిపుచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ధృవీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీపీఎం కేంద్ర కమిటీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఐసీయూ(ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న చికిత్సకు కూడా ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తోందని సీపీఎం తన ప్రకటనలో పేర్కొంది. ఆ ఆరోగ్యం మెరుగుపడుతుండటంతోనే ఎమర్జెన్సీ రూమ్ నుంచి ఐసీయూకు తరలించారని పార్టీ వెల్లడించింది.

సీతారాం ఏచూరి ప్రస్థానం..

సీతారాం ఏచూరి.. 12 ఆగస్టు 1952న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి.. ఏపీ ట్రాన్స్‌పోరట్ కార్పొరేషన్‌లో ఆటోమొబైల్ ఇంజీనిర్ ఉద్యోగంలో చేరడంతో వారు హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. సతారం తండ్రి తరచుగా ట్రాన్స్‌ఫర్ అవుతుండేవారు. దాంతో సీతారం తన అమ్మమ్మ దగ్గర పెరిగారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. 11వ తరగతి విద్యను కూడా ఢిల్లీలోనే పూర్తి చేశారు. అప్పటి నంచి ఆయన విద్య, జీవితం, రాజకీయాలు అన్నీ ఢిల్లీలోనే కొనసాగాయి. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి అయిన రెండో వ్యక్తి సీతారాం.

Tags:    

Similar News