విశాఖ తుఫాన్ లో చిక్కుక్కున్న వైసిసి, మరొకరి రాజీనామా

వైసిపికి గుండెకాయ అవుతుందునుకున్న విశాఖలో తుఫాన్ లేచింది. ఇది ఇంకా బలపడే సూచనలే కనిపిస్తున్నాయి. తిరుగుబాటు నేతలు కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ అంటున్నారు

Update: 2023-12-30 01:42 GMT


విశాఖ వైఎస్ కాంగ్రెస్ లో తీవ్రమయిన అలజడి నెలకొంది. ఇది బాగా ముదిరి తుఫాన్ గా మారి తీవ్రనష్టం కలిగించే సూచనలు కనబడుతున్నాయి. వైసిపి నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపారు. తొందరలో సుధాకర్ టిడిపిలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

గత కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని, అందుకే ఇక ఉండలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇపుడు వైసిపి రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో సమస్యలుఎదుర్కొంటూ ఉంది. అయితే, తన మానసిక రాజధాని అయిన విశాఖ భిన్నంగా ఉంటుందని, విధేయంగా ఉంటుందని జగన్ భావించారు. అయితే, అంతా తారుమారుఅవుతున్నది. పార్టీలో తొలినుంచి ఉన్న నాయకులు జగన్ కు గుడ్ బై చెబుతున్నారు.

ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పార్టీని విడిచిపెట్టిన 48 గంటల్లోనే సీతంరాజు సుధాకర్‌ రాజీనామా చేయడం రానున్న పెను తుఫాన్ కు సూచనగా రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. ఇంకొందరు అధికార పార్టీని వీడతారనే ఊహాగానాలు బాగా వినబడుతన్నాయి. పార్టీ నగర కమిటీ అధ్యక్షునిగా చాలా కాలం పనిచేసిన వంశీకృష్ణశ్రీనివాస్‌ రాజీనామా చేయడమే కాదు, ఏకంగా జనసేనలో చేరిపోవడాన్ని నాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది.

దారి చూపిన పంచకచర్ల

విశాఖ జిల్లా వైసిపి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకచర్ల రమేశ్ బాబు పార్టీని వీడిపోయి జనసేనలో చేరి చాలా మందికి దారి చూపారు. ఆయన దారిలోనే వంశీకృష్ణ వెళ్లిపోయారు. విఎంఆర్ డిఎ చెయిర్ పర్సన అక్కర మాని విజయనిర్మల కూడా దారి వెదుక్కుంటున్న తెలుస్తున్నది. ఆమె పదవీ కాలం ముగిసింది. ఆమె విశాఖ తూర్పు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే, అదినేరవేరడం లేదు. అందువల్ల ఆమె తొందరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని అనుకుంటున్నారు.

నాయకత్వం నియంతృత్వ ధోరణి, ప్రభుత్వం మీద వివిధ వర్గాల్లో వ్యతిరేకత, మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే టాక్ బాగాబలపడుతూ ఉండటం, తెలుగుదేశం-జనసేనలు కలిస్తే మంచిఫలితాలు వస్తాయనే వినబడుతూ ఉండటం, సర్వేల పేరుతో నిర్ణయాలు లీడర్లను బాధించే తీసుకుంటూ ఉండటంతో పార్టీలో భవిష్యత్తు కనిపించని నేతలంతా మరో దారి వెదుక్కుంటున్నారు. వంశీ కృష్ణ తో పాటు మరొక ఇద్దరుకార్పొరేట్లు నాగరాజు, సాదిక్‌ లు కూడా వైసీపీని వదిలిపెట్టి జనసేనలో చేరారు. ఇంకా ఒక అరడజను కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై కొట్టాలనుకుంటున్నట్లు సమాచారం.

సుధాకర్ గురించి

ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గెలుపొందారు. తర్వాత నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించారు. అదిదొరకలేదు.తన కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే సీటు వస్తుందనుకున్నారు. అదీ దొరకేలా లేదు. వాసుపల్లి గణేశ్ రావు ను ఎంపిక చేసినట్లు సమాచారం బయటకు పొక్కడంతో సుధాకర్ మనస్థాపం చెందారు. ఈ సారి ఎన్నికల్లో బిసిలకు ప్రాముఖ్యం ఇవ్వాలనే పేరుతో ఈ నియోజకవర్గం నుంచి మత్య్స కార వర్గానికి చెందిన చిరంజీవి రావును పోటీకిపెట్టాలని భావించినట్లు తెలిసింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి బ్రాహ్మణులు గెలిచారని, అందువల్ల ఈ సారి తనకే సీటు ఇవ్వాలని సుధాకర్ ఆశిస్తున్నారు. గతంలో ద్రోణం రాజు సత్యనారాయణ, ఆయనకుమాడరు శ్రీనివాసరావు కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈ సంప్రదాయం కొనసాగించాలని ఆయన వాదిస్తున్నారు. అయితే, ఈ నియోజకవర్గం మత్య్స కారుల ప్రాబల్యం బాగా ఉందని, అందువల్ల ఆ వర్గానికే సీటు ఇవ్వాలని నాయకత్వం భావిస్తుండటంతో పార్టీలో ఇక భవిష్యత్తు లేదని సుధాకర్ రాజీనామ చేశారు. ఆయన తొందరలో తన అనుచర కార్పొరేటర్లతోకలసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News