‘ఫీజు దోపిడీలను నియంత్రించండి’.. సీఎంకు విద్యార్థి తల్లిదండ్రుల లేఖ..

ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల పేరిట ఆర్థిక దోపిడీ జరుగుతుందని, దానిని నియంత్రించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్స్ కరింది.

Update: 2024-06-18 06:48 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని విద్యార్థి తల్లిదండ్రుల తరపున ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ బోర్టు ఓ లేఖ రాసింది. తల్లిదండ్రులపై విద్యా సంస్థలు మోపుతున్న ఫీజుల భారాన్ని నియంత్రించాలని వారు కోరారు. ఎప్పటికప్పుకు కొత్త తరహా ఫీజు కట్టాలని ప్రాణాలు తోడేస్తున్నారని, దీని వల్ల పిల్ల చదువలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయని వాపోయారు. విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు చెల్లించిన రోజుల వ్యవధిలోనే ఇంకేదో పేరుతో దాని ఫీజు చెల్లించమంటున్నారని, వారు అందించే ప్రతి ఒక్క వసతికి ప్రత్యేక ఫీజు డిమాండ్ చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారని కమిషన్ వివరించింది. ఈ మేరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు, ఫీజులపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరింది. దాంతో పాటుగా విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరింది.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,249 ప్రైవేటు పాఠశాలు, 2087 జూనియర్ కళాశాలలో విద్యార్ధులు చదువు తున్నారు.(అనుమతులు లేకుండా పాఠశాల జూనియర్ కళాశాలలు, పరిమితికి మించి తరగతి గదులు నిర్వహణ వందల సంఖ్యలో ఉన్నాయి). విద్య హక్కు చట్టం 2009 జివో 1, నిబంధనలకు, పాఠశాల విద్యశాఖ, ఉత్తర్వులకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు , సొసైటీ ,ట్రస్ట్ చట్టాలకు వ్యతిరేకంగా ట్యూషన్ ఫీజు, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, పరీక్ష ఫీజు, లేబొరేటరీ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, కంప్యూటర్ లాబొరేటరీ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫీజు, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, స్టూడెంట్ హెల్త్ కేర్ స్కీమ్, స్టడీ టూర్ ఇలా పలు మార్గాల్లో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ అకడమిక్ ఫీజులకు అదనంగా, విద్యార్థి రవాణా ఛార్జీలు, హాస్టల్ ఛార్జీలు (బోర్డింగ్ మరియు లాడ్జింగ్ ఛార్జీలు) విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులకు విరుద్ధంగా కళాశాలలకు అనుబంధంగా కోచింగ్ సెంటర్లను, అనుబంధం హాస్టల్‌లను నిర్వహిస్తూ లక్షల రూపాయలను ఫీజుల పేరుతో దోపిడి చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి వర్గాల కష్టాలను పరిగణనలోకి తీసుకుని. సుప్రీంకోర్టు వివిధ తీర్పులను దృష్టిలో ఉంచుకుని, చట్టాల అమలులో, ఫీజులు దోపిడీ నియంత్రణలో గత ప్రభుత్వ లోపాలను, వైఫల్యాలను గుణపాఠంగా ఫీజుల నియంత్రణకు, ప్రభుత్వ చట్టాల అమలుకు ప్రత్యేక చట్టం తేవాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APSERMC) ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

జిల్లాల వారి ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు,విద్యార్థి ,తల్లిదండ్రులు, ప్రైవేట్ యాజమాన్యాలతో కమిటీ ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాము. విద్య హక్కు చట్టం 2009నీ రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థుల నుండి వివిధ రకాలైన ఫీజులు వసూలు నియంత్రణకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల అభివృద్ధికి బోధన, బోధనేతర వసతుల కల్పన కు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’’ అని కమిషన్ తమ లేఖలో పేర్కొంది.

Tags:    

Similar News