బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ సర్టిఫికెట్లు: లోకేష్ హామీ

వైసిపి పట్టు నుంచి బిసిలను మళ్లీ ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు పార్టీ నేత లోకేష్ ‘జయహో బిసి’ కార్యక్రమం మొదలుపెట్టారు.

Update: 2023-12-29 07:18 GMT
జయహో బిసి అంటున్న తెలుగుదేశం పార్టీ

వెనకబడిన కులాల (బిసి) అభ్యర్థులకు శాశ్వత కుల ధృవీకరణ సర్టిఫికెట్టు ఇస్తామని తెలుగుదేశం పార్టీ  ప్రకటించింది.ఇపుడు అవసరమయినపుడల్లా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవలసి ఉంటుంది. కులం ఎపుడూ మారకపోయినా, అధికారులు మాత్రం ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు పిలిచినా, కాలేజీలో రిజర్వేషన్లకు అప్లైచేసినా తాజాగా తీసుకున్న కుల ధృవీకరణ సర్టిఫెకేట్ సమర్పించాలని చెబుతుంటారు. ఈ నియమం వల్ల అభ్యర్థులు చాలా  ఇబ్బందుల పాలవుతుంటారు. ఇలాంటి కష్టాల్లేకుండా జీవితాంతం చెల్లుబాటయ్యే క్యాస్ట్ సర్టిఫికేట్ అను అధించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ తొందర్లో నిర్వహించ బోయే జయహో బిసి కార్యక్రమంలో ప్రధానంగా ప్రచారం చేస్తారు.




 

ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు

జయహో బిసి కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేస్తాం. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బిసి సోదరులకు మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాం.

రిజర్వేషన్లు తగ్గించారు

వైసిపి అధికారంలోకి వచ్చాక బిసిలకు జరిగిన అన్యాయాలను సరిచేస్తామనిలోకేష్ చెప్పారు.అన్న ఎన్టీఆర్ 1982లో బిసి సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి కీలకశాఖలు ఇచ్చి గౌరవించారు. బిసి అంటే బలహీనవర్గం కాదు, బలమైన వర్గం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 24శాతం రిజర్వేషన్ కల్పిస్తే, చంద్రబాబునాయుడు 34శాతానికి పెంచారు. వైసిపి ప్రభుత్వం  బిసి రిజర్వేషన్లను 10 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.అలాగే బిసి కులాలకు 56 కార్పొరేషన్ల్లు ప్రకటించి నిధులు విడుదల చేయకుండా వాటిని చంపేశారని లోక్షేష్ అన్నారు.

బిసిల భూములు కూడా కొట్టేశారు!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ ను 10శాతం తగ్గించారు, బిసిలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్ భూములు కొట్టేశారు. ఆదరణ పథకం కింద గతంలో లబ్ధిదారులు చెల్లించిన 10శాతం డిపాజిట్ కూడా ఇవ్వలేదు, 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు లేవు. బిసి కార్పొరేషన్ల డైరక్టర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జిఓ 217తో మత్స్యకారుల వెన్నవిరిచారు. చేనేతలు, పట్టురైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. బిసి సోదరులతరపున పోరాడుతున్న అనేకమంది బిసినాయకులపై తప్పుడు కేసులు బనాయించారు. 

Tags:    

Similar News