టీడీపీలో సీట్లు దక్కని సీనియర్లు వీరే

టీడీపీ-జనసేన ఉమ్మడి ఫస్ట్‌ లిస్ట్‌లో టీడీపీ సీనియర్‌ నేతలకు మొండిచేయి ఎదురైంది

Update: 2024-02-24 08:59 GMT
Chandrababu, Pavan kalyan

టీడీపీ-జనసేన ఉమ్మడి ఫస్ట్‌ లిస్ట్‌లో టీడీపీ సీనియర్‌ నేతలకు మొండిచేయి ఎదురైంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు.., బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, యరపతినేని.., మండలి బుద్దప్రసాద్‌, ఆనం రామనారాయణరెడ్డి.., సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీకే పార్ధసారథికి తొలి జాబితాలో చోటు దక్కలేదు.

13 మంది మహిళలకు చోటు...
99 మందితో ప్రకటించిన టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలిజాబితాలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. వయసుల వారీగా చూస్తే.. 35 ఏళ్లలోపు యువకులు ఇద్దరు, 36-45 మధ్య వయసున్నవారు 22 మంది.. 46-60 ఏళ్ల వయసున్నవారు 55 మంది, 61-75 ఏళ్ల వయసున్నవారు 20 మంది. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరూ ఉన్నత విద్యావంతులే. ఇందులో ఐఏఎస్‌ ఒకరు, పీహెచ్‌డీ ఇద్దరు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ 30 మంది.. ఎంబీబీఎస్‌ ముగ్గురు, గ్రాడ్యుయేట్లు 63 మందికి టికెట్లు దక్కాయి.
రగిలిన అసమ్మతి...
టీడీపీ జాబితాపై అసమ్మతి భగ్గుమంది. గజపతినగరం టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. నియోజకవర్గ ఇంచార్జ్ కే.ఏ.నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై క్యాడర్‌ మనస్తాపం చెందుతోంది. ఎన్నికలను దూరంగా ఉండాలని నాయుడుపై క్యాడర్‌ ఒత్తిడి తెస్తోంది. గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్‌తో సమాలోచనలు చేస్తున్నారు కేఏ.నాయుడు.
కళ్యాణదుర్గంలో
...
అటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసింది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
డబ్బుకు చంద్రబాబు అమ్ముడు పోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ వారికి కాకుండి నాన్ లోకల్ వారికి టికెట్ ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీని కచ్చితంగా ఓడించి తీరుతాం అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
తొలి జాబితా విడుదల...
టీడీపీ, జనసేన తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి తొలిజాబితాను విడుదలైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సంయుక్తంగా లిస్ట్‌ను ప్రకటించారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా... జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో క్లారిటీ ఇస్తామని చంద్రబాబు తెలిపారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తాము సీట్లు తగ్గించుకున్నట్లు పవన్‌ తెలిపారు. ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదన్న పవన్‌... పరిమిత సంఖ్యలో పోటీ చేసి గెలవాలని అన్నారు.
Tags:    

Similar News