ఇంటర్ లో ఈ జిల్లానే టాప్
ఆంధ్రప్రదేశ్‌లో బాయిస్ కంటే బాలికలే ఎక్కువ మంది ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించారు.;
మంత్రి నారా లోకేష్ శనివారం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,25,848 మంది ఫస్ట్ ఇయర్, 4,91,254 మంది సెకెండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. జనరల్ విద్యార్థులు 9,09,325 మంది ఉండగా, వొకేషనల్ విద్యార్థులు 71,842 మంది ఉన్నారు. ప్రయివేటు విద్యార్థులు 35,935 మంది ఉన్నారు. సెకెండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 83 శాతం, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకెండ్ ఇయర్ వొకేషన్ విద్యార్థులు 77 శాతం, మొదటి సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండర్ ఇయర్‌లో 80 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా 86 శాతం మంది బాలికలు పాసయ్యారు. మొదటి ఏడాదిలో 66 శాతం మంది బాలురు పాసైతే, 75 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్‌లో కూడా అదే కంటిన్యూ అయ్యింది. సెకెండ్ ఇయర్‌లో 67 శాతం మంది బాలురు పాసైతే, 84 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాదిలో 50 శాతం మంది బాలురు పాసైతే, బాలికలు 71 శాతం మంది పాసయ్యారు.