Tragedy| మరణంలోనూ ఆ ముగ్గురూ స్నేహితులే..
మంచు వల్ల దారి కనిపించక కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు మరణించారు. జీపీఎస్ సందేశంతో వారి కుటుంబీకులు అప్రమత్తం అయ్యారు.
విహారయాత్రకు కలిసి వెళ్లిన నలుగురు మిత్రులు స్వప్రాంతానికి వచ్చారు. కారులో బయలుదేరిన వారిని మృత్యువు వెంటాడింది. వారిలో ముగ్గరు స్నేహితులు మరణిస్తే, మరోకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ప్రమాద స్థలాన్ని గుర్తించగానే, తమ వారి మృతదేహాలను చూసిన సంబంధీకులు కన్నీరుమున్నీరయ్యారు. వారికి అందిన జీపీఎస్ మెసేజ్ వల్లే, సంఘటనను గుర్తించి, పోలీసులను అప్రమత్తం చేయగలిగారు. ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముగ్గురు మరణించినట్లు సంఘటన జరిగిన తీరు చెప్పకనే చెబుతోంది.
విహారయాత్ర ముగించుకున్న డాక్టర్ల బృందం బెంగళూరు నుంచి బళ్లారికి బయలుదేరింది. అందులో ముగ్గురు డాక్టర్లు ఒక న్యాయవాది ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి బళ్లారి నుంచి ఒకరు బెంగళూరుకు వెళ్ళింది. ఆ కారుకు జీపీఎస్ సిస్టం ఉండడం వల్లనే వారు ప్రమాదానికి గురైన సమాచారం కుటుంబ సభ్యులకు అందేలా చేసింది.