BREAKING | తిరుమల :టీటీడీలో కలకలం రేపిన ఆదేశాలు

హిందూయేతర ఉద్యోగులపై టీటీడీ కొరఢా ఝుళిపించింది. ఆ మేరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-05 06:21 GMT

తిరుమలలో హిందువులు మినహా ఇతర మతస్తులు ఉండడానికి వీలు లేదనే విధంగా టీటీడీ (TTD) నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు టీటీడీలోని వివిధ విభాగంలో పనిచేస్తున్న 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్యమతస్తులుగా గుర్తించిన పాలిటెక్నిక్, ఆయుర్వేదిక్ కాలేజీల ప్రిన్సిపాళ్ల తోపాటు అధ్యాపకులు, ఇంకొందరు ఉద్యోగులు ఉన్నారు..

ఈ వ్యవహారంపై టిటిడిలోని ఓ సీనియర్ అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ,

"అన్యమతస్తులుగా గుర్తించిన 18 ఉద్యోగులను శ్రీవారి సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి" అని ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు చెప్పారు. అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి, టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరిగే నిత్య కార్యక్రమాలు, వాహన సేవలకు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ ఉద్యోగుల సేవలు కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేసే దిశగా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెబుతున్నారు.కాగా

టీటీడీలో దాదాపు ఆరువేల మందికి పైగానే శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగ నియమాకలు జరిగే సమయంలో హిందువులుగానే ధ్రువపత్రాలు సమర్పించారు. అయితే వారిలో చాలామంది క్రిస్టియన్ చర్చిలకు వెళ్లడం. తిరుమల శ్రీవారి ప్రసాదాలు స్వీకరించకపోవడం. వంటి ఘటనలు తరచూ వెలుగు చూశాయి. దీంతో తరచూ టిటిడిలో ఇది వివాదంగా మారింది. వారిపై చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వాలు, టిటిడి పాలక మండల్లు సీరియస్గా వ్యవహరించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

 అయితే, 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి టిడిపి కూటమి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో టీవీ-5 చైర్మన్ బి.ఆర్ నాయుడు టిటిడి పాలక మండలి అధ్యక్షులుగా నియమితులయ్యారు. తిరుమలలో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందే,

"టీటీడీలో హిందువుల తప్ప ఇతర మతస్తులు ఉండడానికి వీల్లేదు" అని తన ముందస్తు అజెండాను విస్పష్టంగా ప్రకటించారు.
టిటిడి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా బిఆర్ నాయుడు క్రిస్టియన్ మతానికి చెందిన ఉద్యోగులు, అధికారులను రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోకి మార్చడం. లేదంటే విఆర్ఎస్ ఇవ్వడానికి కూడా వెనకాడమని తగేసి చెప్పారు.
ఆ తర్వాత ఏమైంది
టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధితులు స్వీకరించిన తర్వాత విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ( TTD vigilance and security wing) క్రిస్టియన్ మతానికి చెందిన వారీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరించింది. వారి ధ్రువపత్రాలతో పాటు ఆ ఉద్యోగుల ఊర్లకు వెళ్లి మరి విచారణ లోతుగా సాగించి వివరాల సేకరించినట్లు సమాచారం. ఆ విధంగా టీటీడీలో దాదాపు 300 మందికి పైగానే క్రిస్టియన్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిలో కొందరితో టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు స్వయంగా కూడా మాట్లాడినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే విఆర్ఎస్ ఇవ్వడానికి కానీ డిప్యూటేషన్ పై ప్రభుత్వ శాఖలకు వెళ్లడానికి విముఖత వ్యక్తం చేసినట్లు టిటిడి వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన టిటిడి యంత్రాంగం తాజాగా అంటే మంగళవారం అన్నే మతస్థులైన క్రిస్టియన్లను టిడిపి నుంచి 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తరంలో జారీ చేసింది. బదిలీ అయిన వారిలో టిటిడి మహిళా పార్టీ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఇంకొందరు ఉద్యోగులు ఉన్నారు. ఈ పరిణామాలు ఎలా దారి తీస్తాయి అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News