అమరావతికి 15 వేల కోట్ల సాయం: నిర్మల

ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Update: 2024-07-23 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సహాయం అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా భారతదేశ జీవధార వంటి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్త చేయడం ద్వారా భారతదేశంలో ఆహార కొరతకు చెక్ చెప్పొచ్చని ఆమె పేర్కొన్నారు. అదే విధంగా అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామని కూడా తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామని, విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు అందిస్తామని చెప్పారు. ఓర్వకల్, కొప్పర్తి నోడ్ లకు నీళ్లు, రోెడ్ల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చంద్రబాబు సాధించారు

అయితే బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు అదనపు నిధులు ఇవ్వడనాకి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన చర్చలు ఫలదాయకంగా మారాయని, అద్భుతమైన ఫలితాలనే వెలువరిచాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అంతేకాకుండా విమర్శలు గుప్పించిన వారందరికీ కూడా చంద్రబాబు తన ఫలితాలతో సమాధానం చెప్పారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఢిల్లీ చక్కర్లు కొడుతున్న చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం తెస్తారో చూస్తామన్న వారంతా ఈరోజు కళ్లప్పజెపపి, నోర్లు తెరుచుకుని చూస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు.

Tags:    

Similar News