ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ సత్తా చాటుతుందా?
ఊపు మీదున్న ఎస్‌ఆర్‌హెచ్. ఆదివారం విశాఖలో ఇరుజట్ల మధ్య మ్యాచ్. భారీ స్కోరుపై ఆశలు పెట్టుకున్న అభిమానులు.;
వారం రోజుల వ్యవధిలో విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరోసారి సందడికి వేదిక కాబోతోంది. ఐపీఎల్ 2025 టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో భాగంగా ఈనెల 24న ఢిల్లీ క్యాపటిల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. ఈ ఐపీఎల్ సీజనులో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఆడిన తొలి ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. వైజాగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 211 పరుగులు చేసి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. విశాఖ స్టేడియంలోనే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్–సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆట ప్రారంభమవుతుంది.
ఢిల్లీ మళ్లీ సత్తా చాటుకుంటుందా?