చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే
లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన వైఎస్ జగన్ బుధవారం ఆ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.;
చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే.. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని తాను ఎన్నికల సమయంలోనే ప్రజలకు చెప్పానని, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కూటమి మేనిఫెస్టోను అమలు చేయడం సాధ్యం కాదని, రాష్ట్ర బడ్జెట్ ఎంత, తాను చేపట్టిన పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది, చంద్రబాబు చెప్పిన వాటికి ఎంత కావాలి అనే విషయాలు వివరింగా చెప్పానన్నారు. కానీ ఏదైతే చేయగలుగుతామో అనే చెప్పాలి.. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని జగన్ అన్నారు.
ఓడి పోయాం.. పర్యాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ పర్వాలేదు. తన లండన్ పర్యటన అనంతరం ఆయన బుధవారం ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులే డిప్యూటీ మేయర్లు, చైర్మన్ పదవులు దక్కించుకున్న నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్లు.. నాయకుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.