తమిళనాడు సమావేశం: డీలిమిటేషన్ పై తన అభిప్రాయం వ్యక్తం చేసిన కేరళ సీఎం

చెన్నైలో కొనసాగుతున్న జేఏసీ మీటింగ్;

Update: 2025-03-22 07:06 GMT

దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ మెడపై కత్తిలా వేలాడుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఆయన చెన్నై జరుగుతున్న డీలిమిటేషన్ సమావేశానికి వచ్చిన సందర్భంగా తన అభిప్రాయాలను వెలువరించారు.

ప్రారంభమైన సమావేశం..
డీలిమిటేషన్ పై తొలి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశం చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శనివారం ప్రారంభం అయింది.
ఈ సమావేశంలో కనీసం ఐదు రాష్ట్రాల నుంచి 14 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. డీలిమిటేషన్ వలన అధిక ఆర్థిక వృద్ది, అక్ష్యరాస్యత ఉన్న రాష్ట్రాలకు లోక్ సభ సీట్ల పునర్విభజన వల్ల కలిగే ముప్పుపై చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాజధాని చెన్నై వచ్చిన నాయకులలో కేరళ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, ఏ. రేవంత్ రెడ్డి, భగవంత్ మాన్, శిరోమణి అకాలీదళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ భుందర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ ప్రధాన కార్యదర్శి పీఎంఎ సలాం ఉన్నారు.
ఈ డీలిమిటేషన్ పై దక్షిణాదితో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని రాష్ట్రాలను డీఎంకే ఆహ్వానించింది. ఇందులో కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ లు ఉన్నాయి. అయితే ఈ సమావేశానికి రాకూడదని తృణమూల్ తరువాత నిర్ణయం తీసుకుంది.
ఇదో మైలురాయి..
మార్చి 5న చెన్నైలో జరిగిన డీఎంకే నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశాన్ని ఒక మైలురాయి క్షణంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఒకే కారణం కోసం భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి 58 పార్టీలు పాల్గొన్నాయి. ‘‘ఈ అభిప్రాయం తమిళనాడు ప్రజాస్వామ్యం, న్యాయంపట్ల అచంచలమైన నిబద్దతను ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.
‘‘ఈ చారిత్రాత్మక ఐక్యతను పెంపొందించడానికి మా ఎంపీలు, మంత్రులు, ఇతర రాష్ట్రాల నాయకులతో మాట్లాడి, మా సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేశారు. తమిళనాడు చొరవగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు జాతీయ ఉద్యమంగా ఎదిగింది.
భారత్ లోని రాష్ట్రాలు న్యాయమైన ప్రాతినిధ్యం కోసం ఇప్పుడు చేతులు కలిపాయి. ఇది మా ఉమ్మడి ప్రయాణంలో ఇది ఒక నిర్ణయాత్మక క్షణం. ఇది దేశ భవిష్యత్ ను రూపొందించే ఉద్యమానికి ప్రారంభం. మనమంతా కలిసి ఫేర్ డీలిమిటేషన్ ను సాధిస్తాము’’ అని స్టాలిన్ అన్నారు.


Tags:    

Similar News