వర్షాలకు 1039 కిలోమీటర్లు దెబ్బతిన్న రోడ్లు

నష్టాన్ని వెల్లడించిన ఆర్అండ్ బి అధికారులు;

Update: 2025-08-29 11:26 GMT

తెలంగాణలోకురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లి రోడ్లు కొట్టుకుపోయాయి.మొత్తం 1039 కి.మీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు.జాతీయ రహదారులు కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలు స్థంభించాయి.రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై.. పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా కుదేలైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, కల్వర్టులు సైతం కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి.. అనేక ఊళ్లు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు దెబ్బతినడంతో వాహనాలు మధ్యలోనే ఆగిపోయి, ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి

 

రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బీ డివిజన్ల నుండి అందిన సమాచారం మేరకు అధికారులు స్పందించారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయ్యింది. పలు జిల్లాలు నీటిలో తడిసి ముద్ద అయ్యాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు దెబ్బతిని కూలిపోయాయి. కల్వర్టులు నీళ్లలో కొట్టుకుపోయాయి. వాగులు పొంగిపొర్లాయి. ఊళ్లకు ఊళ్లే నీళ్లలో మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

జాతీయ రహదారి 44 పలుచోట్ల దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలను సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌ మీదుగా దారి మళ్లిస్తున్నారు

 

ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 31 చోట్ల రోడ్లు తెగిపోయాయి. 10 చోట్ల తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి పునరుద్ధరణ చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. 356 చోట్ల కాజ్‌వేలు, కల్వర్టులు ధ్వంసం అయ్యాయి. 289 చోట్ల రోడ్డు మళ్లింపు చర్యలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. రాకపోకలకు ఇబ్బంది ఉన్న 305 ప్రాంతాల్లో 236 ప్రాంతాలు ఇప్పటికే రోడ్లు క్లియర్ చేశారు. మొత్తం 206 చోట్ల సిడీ వర్క్స్ దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.53.76 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.1157.46 కోట్లు అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News