ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం
ఢిల్లీలోని నంగ్లోయ్ నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ నేత బండి సుధాకర్ గౌడ్ ప్రచారం;
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు నేటితో ముగిశాయి. అన్ని పార్టీలు తమ ప్రచారాలను విజయవంతంగా ముగించాయి. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కాగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించాలని ప్రతి పార్టీ నేతలు భావిస్తునస్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ lg ఢిల్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. హస్తినను హస్తం గుర్తు హస్తగతం చేసుకుంటేనేరాజధాని అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
ఢిల్లీ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కులు బీజేపీకి లేదని, ఆప్‌కు కూడా లేదని వ్యాఖ్యానించారాయన. ఢిల్లీలోని నాంగ్లోయ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి రోహిత్ చౌధరి తరఫున బండి సుధాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పరస్పర రాజకీయ విభేదాల కారణంగా నగర అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయి, అభివృద్ధి వ్యతిరేకంగా మారిపోయాయని విమర్శించారు. "కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఢిల్లీలో అధికారంలోఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ లు కలహించుకోవడంలో మునిగిపోయిన ఢిల్లీ అభివృద్ధిని విస్మరించాయి. ఈ రెండు సారాంశంలో అభివృద్ధి వ్యతిరేక పార్టీలుగా మారిపోయాయి."అని సుధాకర్ గౌడ్ అన్నారు.
దీనికి ఆయన అవుటర్ ఢిల్లీ పరిస్థితిని ఉదహరించారు. " రాజకీయ వివాదాలకు ప్రాముఖ్యం ఇచ్చి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కూడా దీనికోసం వాడుకుంటూ వస్తుండంట అవుటర్ ఢిల్లీ మురికి కూపంగా మారింది.దీన్నినేను స్వయాన చూసి షాక్ తిన్నాను," సుధాకర్ గౌడ్ అన్నారు.
గత పది సంవత్సరాల్లో అభివృద్ధి విషయంలో ఢిల్లీలో కనీస పురోగతి కూడా జరగలేదని, ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప మరో అభివృద్ధి లేకపోయిందని చెప్పారు.
నెహ్రూ కుటుంబం సొంత భూములను ప్రజల కోసం ఇచ్చి, ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితిని ప్రజలు గుర్తించి, అభివృద్ధి వ్యతిరేక ఆప్, బీజేపీ పార్టీలను తిరస్కరించి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.