‘కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలి’

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ముట్టడించారు.

Update: 2024-06-07 10:51 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడారు. ఆయన మట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్ శ్రీచైతన్య, నారాయణ, రెసోనెన్స్ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు, అకాడమీల పేరుతో లాంగ్ టర్మ్, నీట్, జెఈఈ కోచింగ్ పేరుతో ఒకే క్యాంపస్‌లో హస్టల్స్, కాలేజీ నడుపుతు లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నా ఇంటర్మీడియట్ అధికారులు పరివేక్షణ లేదన్నారు.


హైదరాబాద్ మాదాపూర్, అయప్ప సొసైటీలలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్స్ తీసుకుని పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. అడ్మిషన్లు క్లోజ్ అనే పేరుతో ఫీజుల దందా చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అధికారులు అనుమతులు లేకుండా, అఫిలియేషన్ లేకుండా తరగతులు ఇప్పుడే ప్రారంభించారని ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఈ దందా నడుస్తున్నా అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు.

ప్రభుత్వం తక్షణమే కార్పోరేట్ కళాశాలల ఫీజుల దందా బంద్ చేసి నియంత్రణ తేవాలని ఒకే క్యాంపస్లో కళాశాల, హస్టల్స్ నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

-ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1684 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని , కళాశాలలు ప్రారంభమై వారం దాటినా పాఠ్యపుస్తకాలు ఇంకా ఇవ్వలేదని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఇచ్చి కళాశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

 

-రీ - వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఉచితంగా వేరిఫికేషన్ చేసి,మార్కులను తప్పులు లేకుండా స్పష్టంగా ప్రకటించాలని కోరారు.

-ప్రభుత్వం ప్రకటించిన విధంగా మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అందించాలని డిమాండ్ చేశారు.

ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం నిరసిస్తూ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు చేశారు. గేట్లు ఎక్కి నిరసన తెలియజేశారు, కార్పోరేట్ శక్తులకు లోంగకుండా నిష్పక్షపాత ధోరణిని అవలంభిస్తూ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


అనంతరం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు రజనీకాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.మమత, డి.కిరణ్,ఉపాధ్యాక్షులు సంతోష్ రాథోడ్, బి.శంకర్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, ప్రణయ్,కార్తీక్ లతో కూడిన ప్రతినిధి బృందం కమిషనర్ శ్రీమతి శృతిఓజా ఐ.ఎ.ఎస్.కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్పోరేట్ కళాశాలలు అక్రమాలపై బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, పవిత్ర, , రాష్ట్ర నాయకులు నాగేందర్, శ్రీమాన్, శరణ్య, మస్కు చరణ్ ,గుండె శివ, తరంగ్, స్టాలిన్,కార్తీక్, శ్యామ్, విఘ్నేష్ ,లిఖిత్ మరియు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News