టైం ఇవ్వం... రెండు గంటల్లో కూల్చేస్తాం -రంగనాథ్

చెరువుల్లో, నాలాలపై అక్రమంగా భవనాలు నిర్మించుకుని కోర్టుకెళ్తామంటే కుదరదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

Update: 2024-08-31 15:36 GMT

చెరువుల్లో, నాలాలపై అక్రమంగా భవనాలు నిర్మించుకుని కోర్టుకెళ్తామంటే కుదరదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లాలో ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలించారు. అమీన్ పూర్, పటాన్ చెరు లో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెరువులు ఆక్రమించి, తూములు ఆక్రమించి భవనాలు కట్టుకుని, కోర్టుకెళ్తామంటే కుదరదన్నారు. స్టేలు తెచ్చుకునేందుకు టైం ఇవ్వమని చెప్పేశారు. రెండు గంటల్లో కూల్చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. 

పలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలను రంగనాథ్ పరిశీలించారు. అమీన్ పూర్ లోని శంభునికుంట, శంభికుంట, బంధం కొమ్ము, చక్రపురి కాలనీ, అమీన్ పూర్ పెద్ద చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల తూములను కబ్జా చేసి, కాలువలను మూసేసి అక్రమ నిర్మాణాలు చేసినట్టు స్థానికులు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి ఫిర్యాదు మేరకు ఆక్రమణలపైన పూర్తి నివేదిక ఇవ్వాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులను నివేదిక ఇవ్వాలని కోరారు. శంభునికుంట, అమీన్పూర్ పెద్ద చెరువు, బంధం కొమ్ము చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

పటాన్చెరులోని సాకి చెరువును కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సాకి చెరువు కబ్జాకు గురి కావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అధికారులు ఇప్పటికే చెరువులో పద్దెనిమిది అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. సాకిచెరువు ఎఫ్డీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా పదుల ఎకరాల్లో చెరువు కబ్జా కి గురైనట్టు అంచనా కి వచ్చారు. చెరువు తూములు బందు చేసి ఇన్ కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్టు స్థానికులు రంగనాథ్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్ కోర్ సంస్థ నిర్మించిన అపార్ట్మెంట్లను సైతం రంగనాథ్ పరిశీలించారు. స్థానికంగా ప్రవహించే నక్క వాగు బఫర్ జోన్ కబ్జా చేసి కట్టిన బహుళ అంతస్తు నిర్మాణాల పైనా హైడ్రా కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో రంగనాథ్ మాట్లాడుతూ... చెరువుల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్న గుర్తించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఆక్రమణల కూల్చివేత పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.  

Tags:    

Similar News