రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్

తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరించిన సీఎం రేవంత్ రెడ్డి.

Update: 2025-12-03 12:18 GMT

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

హిందూ దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రేవంత్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి.. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులను, హిందూ దేవుళ్లను అమానించడమే తమ కార్యాచరణగా కాంగ్రెస్ పెట్టుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా హిందూగాళ్లు.. బొంగుగాళ్లు అని మాట్లాడారని, ఆయనకు ప్రజలు ఎాంటి తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యలను వక్రీకరించారని రేవంత్ స్పష్టతనిచ్చారు.

అదంతా అసత్య ప్రచారం: రేవంత్

తన వ్యాఖ్యలపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ముందూ వెనక కట్ చేసి.. ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. హిందూ దేవుళ్లూ, హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ పార్టీ కూడా అని కొత్తగా ఎన్నికయిన తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు చెప్పినట్లు వివరించారు. అయినా తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించడం జరిగిందని అన్నారు.

అసలు రేవంత్ ఏమన్నారంటే

ముఖ్యమంత్రి ఎనుముల(Revanth) రేవంత్ రెడ్డే హిందు దేవుళ్ళపై(Hindu Goddess) వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం(Controversial comments) సంచలనంగా మారింది. ఒక సమావేశంలో మాట్లాడుతు హిందువులకు ఎన్ని దేవతలున్నారు ? దేవుళ్ళున్నారు ? 3 కోట్లున్నారా అని ప్రశ్నించాడు. పెళ్ళి చేసుకోనివాళ్ళకు హనుమంతుడు ఉన్నాడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు ఇంకో దేవుడున్నాడు, మందుతాగేవారికి ఇంకో దేవుడున్నాడు, కల్లుతాగేవాళ్ళకు, కోడిని కోయాలనే వాళ్ళకు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఉన్నారు. పప్పుతినే వాళ్ళకు కూడా దేవుడున్నాడు, అవునా ? అన్నీరకాల దేవుళ్ళున్నారు , అని వ్యగ్యంగా అన్నాడు. ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

Tags:    

Similar News