మద్యం వ్యాపారులకు కోమటిరెడ్డి ముచ్చటగా ‘మూడు’ షరతులు
షరతులను పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా 159 గ్రామాల్లో ప్రత్యేక టీములను ఏర్పాటు చేస్తున్నారు
మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏమి మాట్లాడినా సంచలనమే. ఆమాటకు వస్తే ఏమీ మాట్లాడకపోయినా సంచలనమనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ తో వార్తల్లో వ్యక్తిగా ఉండటం ఎలాగో కోమటిరెడ్డికి తెలిసినట్లు ఇంకెవరికీ తెలీదేమో. ఇపుడు విషయం ఏమిటంటే మునుగోడు నియోజకవర్గంలో మద్యం వ్యాపారులు శనివారం ఎంఎల్ఏని కలిశారు. ఇంతకుముందే మద్యం షాపులను దక్కించుకోవాలంటే దరఖాస్తుల దశలోనే ఎంఎల్ఏ చాలా రూల్స్ పెట్టిన విషయం సంచలనమైంది. ఆ రూల్స్ ఏవీ ఎక్సైజ్ శాఖ పెట్టినవికావు. ప్రభుత్వానికి సంబంధంలేకుండా కోమటిరెడ్డి నియోజకవర్గంలో సొంతంగా నియమాలు పెట్టారు. దాంతో ఎంఎల్ఏ దెబ్బకు మద్యంషాపులకు టెండర్లు వేసిన వ్యాపారుల సంఖ్య బాగా తగ్గిపోయింది.
నియోజకవర్గంలో మొత్తంమీద సుమారు 900 షాపులుంటే వచ్చిన దరఖాస్తులు సుమారు 650 మాత్రమే. అంటే కోమటిరెడ్డి నిబంధనల దెబ్బ ఏస్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. ఇపుడు విషయంఏమిటంటే తనను కలసిన వ్యాపారులకు ఎంఎల్ఏ మూడు షరతులు విధించారు. తాను విధించిన షరతుల ప్రకారమే వ్యాపారం చేయాలని ఎవరైనా ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుందో తాను చెప్పను అని గట్టిగానే చెప్పారు.
ఇంతకీ ఆ షరతులు ఏమిటంటే..
1. రాష్ట్రమంతా వైన్ షాపులు ఉదయం 10 గంటలకు తెరిచినట్లు మునుగోడులో తెరిచేందుకు లేదు. మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే షాపులు తెరవాలి. రాత్రి 10 గంటలకల్లా మూసేయాల్సిందే. లేకపోతే ఇక అంతే సంగతులు.
2. పర్మిట్ రూములు : పర్మిట్ రూములను పగటిపూట అస్సలు తెరవకూడదు. సాయంత్రం 5 గంటలకు తెరిచి రాత్రి షాపులతో పాటు 10 గంటలకు మూసేయాల్సిందే.
3. బెల్టుషాపుల నిషేధం : బెల్టుషాపుల్లో అమ్మకాలు జరిపేందుకు లేదు. మద్యంషాపుల యజమానులు బెల్టుషాపులకు లిక్కర్ అమ్మేందుకు లేదని స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గంలో మద్యం వ్యాపారం చేయాలని అనుకునేవారు తన షరతులను కచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పారు.
ఎవరైనా షరతులను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చారు. మద్యం వ్యాపారులు తానుచెప్పిన షరతులను పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా 159 గ్రామాల్లో ప్రత్యేక టీములను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఎందుకంటే వైన్ షాపులు, పర్మిట్ రూములపై నిఘా ఉంచేందుకే. దరఖాస్తుల సమయంలో పెట్టిన రూల్సుకే దాదాపు 300 షాపులకు దరఖాస్తులు తగ్గిపోయినాయి. ఇపుడు షాపుల అలాట్మెంట్ తర్వాత ఏదోపద్దతిలో వ్యాపారం చేసుకోవచ్చులే, ఎంఎల్ఏని ప్రసన్నంచేసుకోవచ్చులే అని అనుకున్న వ్యాపారులకు కోమటిరెడ్డి తాజా షరతులతో షాక్ కొట్టినట్లయ్యుంటుంది.
ఇన్నిషరతులతో వ్యాపారంచేయటం లాభాల కోసమా లేకపోతే నష్టాల కోసమా ? అని వ్యాపారులు ఆలోచించుకుంటున్నట్లు సమాచారం. మరి తెలంగాణలోని 118 నియోజకవర్గంలోని మద్యం వ్యాపారులకు ఒక రూల్ అయితే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం కోమటిరెడ్డి రూలంటే ప్రభుత్వం ఉన్నట్లా...