అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్
పెన్‌డ్రైవ్‌లో కమిషన్ నివేదికను అందించిన ప్రభుత్వం.;
తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సభ మొదలైన కొంత సేపటికే వాతావరణం వేడెక్కింది. రెండో రోజు సమావేశాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను టేబులు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవతకవలపై ఏడాదిపైగా విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం పెన్‌డ్రైవ్‌ల రూపంలో సభ్యులకు అందించింది. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ‘‘ సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్‌లు చెల్లవు.. అందుకే బిల్లు తెచ్చాం. ఇది తెలిసి కూడా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి మాట్లాడటం సరికాదు. పంచాయతీ, మున్సిపల్ చట్టాల్లో 50 శాతం రిజర్వేషన్లు మించవద్దని చట్టాలున్నాయి. మరోవైపు.. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకించిన హరీష్ రావు. ఆషామాషీగా సర్వే చేయలేదు’’ అని చెప్పారు.
‘‘బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలి. వెనుకబడిన వర్గాలకు పురపాలక ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి. బలహీన వర్గాల ప్రజలంతా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ సవరణ కోరుతున్నాం. ఏకసభ్య కమిషన్ కూడా సామాజిక, ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించాం’’ అని తెలిపారు. ఈ క్రమంలో అనంతరం మాట్లాడిన గంగుల కమలాకర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవోను ముందుగా ఎందుకు తీసుకురావాలేదంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మంత్రికి అవగాహన లేదేమో అన్న ఆయన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి.