‘ఎలక్టోరల్ బాండ్లు’ దేశంలో అతిపెద్ద కుంభకోణం: కాంగ్రెస్

స్వతంత్ర భారతంలో ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే పూర్తి వివరాలు ఈసీ ఇంకా వెల్లడించలేదని విమర్శించింది..ఇంకా ఏమన్నారంటే..

Update: 2024-03-15 11:29 GMT

ఎలక్టోరల్ బాండ్ల పథకం "స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అభివర్ణించారు. అయితే వీటిపై ఎన్నికల సంఘం పూర్తి సమాచారాన్ని ఇంక పంచుకోలేదని పంచుకుంటే ఇప్పుడున్న మొత్తం కుంభకోణం విలువ పెరుగుతుందని అన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎం) కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే ఓటర్లు తమ ఓటు సరిగ్గా వేసినట్లు తెలుసుకునేందుకు పోలింగ్ ప్రక్రియలో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ని ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడాలో విలేకరుల సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడారు. తమ పార్టీ గత సంవత్సరం నుంచి ఎన్నికల సంఘం ప్రధాన అధికారితో అపాయింట్ మెంట్ కావాలని కోరుతున్నప్పటికీ ఇప్పటికి లభించలేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఈసీ ఎందుకు నిరాకరిస్తోంది. ఎవరికి భయపడుతోంది అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ప్రస్తావిస్తూ, వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని రమేష్ అన్నారు.
జాబితాలో నాలుగు కేటగిరీలు ఉన్నాయి - ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, దర్యాప్తు సంస్థల బెదిరింపుల కారణంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు, కాంట్రాక్టులు పొందడానికి లంచంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినవారని ఆయన ఆరోపించారు. ఇవి స్వతంత్ర భారతావనిలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని.. ప్రజాకోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల డేటాను EC వెబ్‌సైట్‌లో ఉంచిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల విక్రయదారుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డేటాలో ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 మధ్య కాలంలో కొనుగోలు చేసిన 22,217 ఎలక్టోరల్ బాండ్లను దాతలు కొనుగోలు చేశారని పేర్కొంది. రాజకీయ పార్టీలు 22,030 మందిని రిడీమ్ చేశాయి.
Tags:    

Similar News