మహారాష్ట్రలో ఇంకా తేలని ఎంవిఎస్ సీట్ల షేరింగ్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి పోటీ చేస్తుందని, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ వెల్లడించింది.

Update: 2024-03-12 11:25 GMT

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మహరాష్ట్రలో పోటీ చేయబోయే భాగస్వాముల మధ్య మార్చి 17 న సీట్ల షేరింగ్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఇంచార్జ్ రమేష్ చెన్నితాల ప్రకటించారు. " మహ వికాస్ అఘాడి కూటమిలోని పార్టీ సీట్ల షేరింగ్ ఫార్మూలాను ఫైనల్ చేస్తాం" అని ఆయన వెల్లడించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించిన విలేకరుల సమావేశంలో రమేష్ చెన్నితాల మాట్లాడారు. ప్రకాష్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడితోను చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసి ముందుకు సాగుతున్నామని చెప్పారు.
"మహా వికాస్ అఘాడి నియోజకవర్గాల మధ్య సీట్ల పంపకం గురించి చర్చలు జరుగుతున్నాయి.. మార్చి 17 తర్వాత ఫార్ములా ఖరారు అవుతుంది. అన్ని పార్టీలు ఒక ఉమ్మడి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లి సమానంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి." అని ఆయన చెప్పారు. కాగా మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
MVA భాగస్వామ్య పక్షాలు - ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని కాంగ్రెస్, శివసేన (UBT) మరియు శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్చంద్ర పవార్) - సీట్ల పంపకంపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి తీవ్రమైన చర్చలు జరుపుతున్నాయి.
సీట్ల పంపకాల చర్చల్లో కాంగ్రెస్, శివసేన (యుబిటి) మధ్య సమన్వయం లోపించిందని ప్రకాష్ అంబేడ్కర్ పార్టీ నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లెటర్ రాశారు. దీనిపై చెన్నితాలను ప్రశ్నించగా వంచిత్ బహుజన్ చీఫ్ చాలా మంచి మిత్రుడని, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్ అతనితో చర్చలు జరుపుతున్నారని ఆయన వివరించారు .
అయితే కాంగ్రెస్ సాధారణంగా పోటీ చేసే సాంగ్లీ, వార్ధా లోక్‌సభ నియోజకవర్గాలకు అంబేద్కర్ తన పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు.


Tags:    

Similar News