తలసరి ఆదాయంలో ప్రగతి సరే.. ఆరోగ్య, పోషకాహార స్థాయి మాటేమిటి?
దేశంలో తలసరి ఆదాయం విషయంలో గుజరాత్ చాలా కాలంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్నట్లు ప్రకటించుకుంటుంది. కానీ పోషకాహార స్థాయిలో మాత్రం..
By : Damayantee Dhar
Update: 2024-08-24 06:03 GMT
ఆరోగ్య సంరక్షణ రంగంలో గుజరాత్ ప్రభుత్వం దేశంలో సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2023-24 ప్రకారం మంచి ఆరోగ్యం - శ్రేయస్సు విభాగంలో వరుసగా రెండోసారి మొదటి ర్యాంక్ ను సాధించింది. అయితే నీతి ఆయోగ్ ప్రకారం ఈ లెక్క వేరే విధంగా ఉంది.
నీతి ఆయోగ్ ప్రకటించిన ఎస్‌డిజి ఇండెక్స్‌లో మంచి ఆరోగ్యం- శ్రేయస్సు విభాగంలో గుజరాత్ వరుసగా రెండవసారి దేశంలో మొదటి స్థానంలో నిలవడం చాలా సంతోషం, గర్వించదగిన విషయమని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు.
"తల్లి- శిశు మరణాలు, సంస్థాగత ప్రసవం, పిల్లలకు పూర్తి రోగనిరోధకత పెరగడం వల్ల మేము దీనిని సాధించగలిగాము" అని ఆరోగ్య కార్యకర్తలను అభినందించడానికి పిలిచిన ఒక కార్యక్రమంలో సీఎం అన్నారు.
ఏది ఏమైనప్పటికీ, NITI ఆయోగ్ ప్రచురించిన 2023-24 కోసం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (SDG) ఇండెక్స్‌ను పరిశీలిస్తే, గుజరాత్‌లో దాదాపు అన్ని ఆరోగ్య సంరక్షణ పారామితులపై ఇంకా చాలా దూరంలో ఉంది.
తక్కువ ర్యాంకులు..
జాతీయ బహుమితీయ పేదరిక సూచిక (MPI) ప్రకారం, గుజరాత్‌లో 38.09 శాతం జనాభా ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గ్రామీణ గుజరాత్ జనాభాలో దాదాపు సగం మంది పోషకాహారానికి దూరమయ్యారు. ఇక్కడ దాదాపుగా 44.45 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు.
పట్టణ ప్రాంతాల్లో 28.97 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో ఉన్నారు. 39 శాతం మంది పిల్లలు వారి వయస్సుకు తగ్గ బరువుతో ఉన్నారు. ఇలా బాధపడుతున్న పిల్లల విషయంలో గుజరాత్ నాల్గవ స్థానంలో ఉంది. గత నాలుగేళ్లుగా ఈ సంఖ్య 39 శాతం వద్ద స్థిరంగా ఉంది.
పిల్లల స్థితి
కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక ప్రమాణాలు బాగానే ఉన్నప్పటికీ, తక్కువ బరువు ఉన్న పిల్లల విషయంలో గుజరాత్ రెండేళ్లుగా స్థిరంగా రెండవ స్థానంలో ఉంది. 2022 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 25.1 శాతం పిల్లలు అధిక బరువుతో, 39.7 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. పిల్లలలో ఆరోగ్య పారామితులలో ఎటువంటి మెరుగుదల లేదు.
జూలై చివరి వారంలో, కచ్‌లోని రెండు గ్రామాలలో ఆరుగురు పిల్లలు మరణించారు, వారి మరణాలకు పోషకాహార లోపం కారణం అని జిల్లా ఆరోగ్య అధికారులు కారణమని తెలిపారు.
ఆర్థికవేత్త వైఫల్యాలు..
గుజరాత్‌లో 38 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆర్థికవేత్త ప్రొఫెసర్ హేమంత్ షా ది ఫెడరల్‌తో చెప్పారు. "రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి వాస్తవాలను నీతి ఆయోగ్ ఎంపీఐ నివేదిక విడుదల చేసిందని’’ అన్నారాయన.
“2019- 2021 మధ్య గుజరాత్ పోషకాహార లోపాన్ని 41.37 శాతం నుంచి 38.09 శాతానికి తగ్గించగలిగింది. అయితే అప్పటి నుంచి ఈ సంఖ్య స్తబ్దుగా అక్కడే ఆగిపోయింది. అత్యధిక జిడిపితో మోడల్ రాష్ట్రంగా ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్రంలో పోషకాహార లోపంతో చిన్నారులు చనిపోవడం కంటే దురదృష్టకరం మరొకటి ఉండదు' అని ఆయన అన్నారు. "ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇదే విధమైన జిడిపి, గుజరాత్ దుస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి చాలా కృషి అవసరం" అని ఆయన అన్నారు.
తక్కువ పోషణ స్థాయిలు..
తలసరి ఆదాయంలో గుజరాత్ దేశంలో చాలాకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది జాతీయ సగటును మించిపోయింది. 2021-22 అంచనాల ప్రకారం, రాష్ట్ర తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 2.5 లక్షలు, జాతీయ సగటు రూ. 1.72 లక్షలు. నిజానికి, గుజరాత్ ప్రభుత్వం 2012లో రాష్ట్రాన్ని అభివృద్ధి నమూనాగా పేర్కొనడం ప్రారంభించింది. కానీ షా ప్రకారం.. అభివృద్ధి చెందిన రాష్ట్రం అని ప్రచారం చేసుకుంటున్న గుజరాత్ లో పిల్లల పోషకాహార స్థాయిలు, శిశు మాతృ మరణాల రేట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
రక్తహీనత ఆందోళనలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటా ప్రకారం గుజరాత్‌లో రక్తహీనతతో బాధపడుతున్న ఆరు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల శాతం 2015-16లో 62.6 శాతం నుంచి 2019-21లో 79.7 శాతానికి పెరిగింది. గుజరాత్, సాపేక్షంగా అభివృద్ధి చెందిన ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ, తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే కీలకమైన పోషక సూచికలలో క్షీణతను చూపించింది. 2018లో గుజరాత్‌లో ఐదేళ్లలోపు పిల్లల్లో 38.5 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2023-24 నాటికి ఈ సంఖ్య 39 శాతానికి పెరిగింది.
మెరుగైన పనితీరు రాష్ట్రాలు
ఇదే కాలంలో బీహార్‌లో స్టంటింగ్ రేటు 48.3 శాతం నుంచి 42.9 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 42 శాతం నుంచి 35.7 శాతానికి, ఉత్తరప్రదేశ్‌లో 46.3 శాతం నుంచి 39.7 శాతానికి తగ్గింది. అదేవిధంగా, గుజరాత్‌లో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సంవత్సరాలుగా తీవ్రమవుతుంది. 2018లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 51.3 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 2023-24లో ఇది 62.5 శాతానికి పెరిగింది.
ఆశావహుల విభాగంలో గుజరాత్
2018 నుంచి 2023-24 వరకు, ఆరోగ్య సంరక్షణ పారామితులలో పురోగతి లేకుండా గుజరాత్ నీతి ఆయోగ్ నివేదిక ఆశావాద వర్గంలో కొనసాగుతోంది. 2019-20 .. 2023-24 మధ్య ఎటువంటి మెరుగుదల లేకుండా రాష్ట్ర స్కోరు 2018లో 46 నుంచి 2023-24లో 41కి తగ్గింది. దీనికి విరుద్ధంగా, తక్కువ GDP.. తలసరి ఆదాయం ఉన్న రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు అన్ని ఆరోగ్య పారామితులను మెరుగుపరుస్తూ, పనితీరు కనబర్చే వర్గానికి చేరుకున్నాయి.