ఉద్దవ్ ఊసరవెల్లిలా రంగులు మార్చాడు: ఏక్ నాథ్ షిండే

ఫడ్నవీస్ ను కలిసిన ఉద్దవ్ ఠాక్రే, అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన షిండే;

Update: 2025-07-19 05:15 GMT
ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డాడు. 2019 లో తన మిత్రుడు దేవేంద్ర ఫడ్నవీస్ కు ఠాక్రే వెన్నుపోటు పొడిచారని శుక్రవారం ఆరోపించారు.

శాసనమండలిలో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన తీర్మానానికి సమాధానమిస్తున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త శివసేన, బీజేపీ కూటమి మెజారిటీ నిలుపుకున్న తరువాత ఫడ్నవీస్ అనేకసార్లు ప్రభుత్వ ఏర్పాటు కోసం పిలుపుఇచ్చినప్పటికీ అధికార కాంక్షతో ఉద్దవ్ స్పందించలేదని ఆరోపించారు.
మహారాష్ట్రలో ఇంత త్వరగా రంగులు మార్చే ఊసరవెల్లిని తాను ఇంత త్వరగా చూడలేదని విమర్శించారు. ఒకప్పుడు తన తగదని అని చెప్పిన వారితో తరువాత చేతులు కలిపారని చెప్పారు. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకున్న తరువాత థాకరే కాంగ్రెస్ తో చేతులు కలిపిన వైనాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘‘కానీ ఠాక్రే(ఉద్దవ్) 2019 లో కూటమి నుంచి బయటకు వెళ్లి ఫడ్నవీస్ ను మోసం చేశారు’’ అని షిండే అన్నారు. 2022 లో ఠాక్రే పై తిరుగుబాటు చేసిన తరువాత తాను తనకు మద్దతు ఇస్తున్న తిరుగుబాటు సేన ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్నామని చెప్పారు. కానీ ఠాక్రే తనతో సంప్రదింపులు జరుపుతూనే మరో వైపు ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వాన్ని మాకు మద్దతు ఇవ్వవద్దని చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.
కక్షతో సంగీత పాఠశాల..
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణం తరువాత ఆమె పేరు మీద సంగీత పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు థాకరే ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిందని షిండే అన్నారు.
కానీ మంగేష్కర్ కుటుంబానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె పేరు మీద నెలకొల్పిన ‘దీనానాథ్ మంగేష్కర్’ అవార్డును ప్రధానం చేయడంతో ఠాక్రే అవమానంగా భావించారని చెప్పారు.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మంగేష్కర్ పేరు మీద ప్రారంభించాలనుకున్న సంగీత పాఠశాలను ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నారని షిండే పాత విషయాలను బయటపెట్టారు. 2022 లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ తిరిగి సంగీత కళాశాల ప్రారంభించానని షిండే తెలిపారు.
ముఖ్యంగా శివసేన(యూబీటీ) చీఫ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన ఒకరోజు తరువాత 2019 లో థాకరే పఢ్నవీస్, బీజేపీకి ద్రోహం చేశాడనే విషయం షిండే గుర్తు చేశారు. ఇంతకుముందు రోజు సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ తిరిగి అధికార కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.
Tags:    

Similar News