జీహెచ్‌ఎంసీ విస్తరణ: వరమా, శాపమా? Water expert, B.V. Subba Rao interview
మెగా హైదరాబాద్ సృష్టితో ప్రాణాళికంగా బద్ధంగా అభివృద్ది జరుగుతుందని ప్రపంచ స్తాయి నగరంగా సిటీ తయారు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. 27 మునికిపాలిటీల విలీనంతో 650 sq kms గా నగరం 2,735 sq kms గా అది అవతరిస్తుంది. జి.హెచ్.ఎం.సి కార్యాలయం దీనిని ఆమోదించటం తో ప్రస్తుతం వున్న 1.45 కోట్ల జనాభా 1.70 కోట్లకు చేరుతుంది. దానితో దేశం లోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం యింకా ఎక్కువ జనాభా వుంటుంది. నగరం లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవలే చేసిన వేలం లో ఎకరా ధర రు. 137 కొట్లు పలికింది. మరి నగరం లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయా. చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్ళటానికి ఒక గంట ప్రయాణం చేయటం చూస్తున్నాం. పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం తో ప్రజలు సంతోషంగా వున్నార అంటే బహుశా లేదు అనే సమాధానం వచ్చే అవకాశం వుంది.
ఈ విషయాల పైన మనతో ఈ రోజు చర్చించటానికి బీవీ. సుబ్బా రావు, పర్యావరణ వేత్త, నాలుగు దశాబ్దాలుగా చెరువులను కాపాడటానికి కృషి చేశారు. సుబ్బ రావు రూర్కీ యూనివర్సిటీ నుండి అప్లైడ్ geology లో మాస్టర్స్ చేశారు. అలాగే Aerial Photo Interpretation from IIT Bombay లో స్పెషలేజేషన్ చేశారు.