"మోక్షజ్ఞకు జూనియర్ శుభాకాంక్షలు, అన్నగారి కుటుంబానికి తిరిగి దగ్గరవ్వాలని ఎన్టీఆర్ ప్రయత్నమా ?

కొంతకాలంగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ దానిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Update: 2024-09-14 10:16 GMT

ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబునాయుడు భార్య అయిన భువనేశ్వరిని నిండుకొలువులో దారుణంగా అవమానించినరోజు అతను మౌనంగానే ఉండిపోయాడు. చంద్రబాబునాయుడును 53 రోజులు జైలులో ఉంచినప్పుడు ఒక్కరోజుకూడా స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ఇరువురూ గొప్పనేతలే అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడుగానీ ఒక స్టాండ్ తీసుకోలేదు. పోయిన ఏడాది ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగినప్పుడు అనేకమంది ప్రముఖులతోపాటు, తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యర్థులగా భావించబడే మెగా ఫ్యామిలీకి చెందిన రాంచరణ్ కూడా హాజరయ్యాడుగానీ, ఇతను హాజరుకాలేదు. అంతెందుకు, ఇటీవల బాలయ్య చలనచిత్ర జీవితం 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా బాలయ్యకు కనీసం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలపలేదు. అందుకే టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు జూనియర్‌పై గుర్రుగా ఉన్నారు.

Tags:    

Similar News