రెగ్యులర్ గా వ్యాయామం చేసినవారే జీవితంలో ముందుకు దూసుకెళతారంటున్న అధ్యయనాలు.

టెక్నాలజీ మన జీవితంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో, అంత నష్టాలు కూడా ఉన్నాయి.

Update: 2024-07-31 08:43 GMT

టెక్నాలజీ మన జీవితంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో, అంత నష్టాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా జీవనశైలిలో అనేక ప్రమాదకర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒంటికి అలుపు లేకుండా పోతోంది. దీనితో ఊబకాయం, షుగర్, బీపీ వంటి అనేక జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. ప్రతి పదిమందిలో ఇద్దరు మాత్రమే వ్యాయామం చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చాలామందికి ఎక్సర్‌సైజ్ చేయటానికి సమయం దొరకదు. మరికొంతమంది దానిని పట్టించుకోరు.

రెగ్యులర్‌గా వ్యాయామం చేసినవారు మెరుగుగా ఆలోచించగలుగుతారు, తమ గురించి తమకు మంచి భావన కలిగిఉంటారు, మెరుగైన నిద్ర పోగలుగుతారు, రోజువారీ పనులను మరింత తేలిగ్గా చేయగలుగుతారు.

అనేక వైద్య అధ్యయనాలు, పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే, మనిషి కనీసం వారానికి 150 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి అని.

అయితే వ్యాయామం అంటే గంటో, గంటన్నరో నడిస్తే సరిపోతుంది అని చాలామంది అనుకుంటారు. మైళ్ళకు మైళ్ళు నడిచేస్తుంటారు. దీనివలన పూర్తిగా ప్రయోజనం లేదనలేముగానీ, చాలా తక్కువ మాత్రమే లాభం ఉంటుంది. శరీరానికి అలుపు వచ్చేటట్లు, చెమటలు పట్టేటట్లు నడిచే బ్రిస్క్ వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ చేస్తేనే పూర్తి ఫలితాలు పొందగులుగుతాము. గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేసే ఈ వ్యాయామాన్ని ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ అంటారు.

ఒక్కో వయసువారు ఒక్కోరకం వ్యాయామాలు చేయాలి. చాలాకాలంపాటు ఎలాంటి వ్యాయామం చేయకుండా ఇప్పుడు మొదలుపెట్టాలనుకునేవారు, తమకు ఎలాంటి మంచిదో తెలుసుకోవటానికి వైద్యుడిని సంప్రదించి, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న తర్వాతే వ్యాయామాన్ని మొదలుపెట్టాలి.

ఈ వ్యాయామాలలో వివిధ రకాలు ఉన్నాయి.

సాధారణ స్థాయి ఎరోబిక్ ఎక్సర్ సైజ్ - బ్రిస్క్ వాకింగ్, ఈదటం, సైకిల్ తొక్కటం, డాన్స్ చేయటం, టెన్నిస్ ఆడటం వంటివి ఈ కోవకు వస్తాయి.

కఠినమైన వ్యాయామాలు - పరిగెత్తటం, వేగంగా సైకిల్ తొక్కటం, మెట్లు ఎక్కటం, ఫుట్ బాల్, హాకీ వంటి ఆటలు, స్కిప్పింగ్, జిమ్నాస్టిక్స్ మొదలైనవి.

తీవ్రమైన కఠిన వ్యాయామాలు - హెవీ వెయిట్‌లు ఎత్తటం, సర్క్యూట్ ట్రైనింగ్, స్పిన్నింగ్ క్లాసెస్, కొండలు ఎక్కటం, ఇంటర్వెల్ రన్నింగ్ ఈ కోవలో ఉంటాయి.

స్ట్రెంగ్త్ ఎక్సర్ సైజులు - కండరాల బలంకోసం ఈ వ్యాయామాలు చేయాలి. బరువులు ఎత్తటం, యోగా, పిల్లేట్స్, తాయ్ ఛీ, పుష్ అప్‌లు, సిట్ అప్‌లు మొదలైనవి.

కనుక వీలైతే ప్రతిరోజూ, లేదంటే కనీసం వారానికి రెండు ముూడు సార్లు వ్యాయామం చేసి గుండెజబ్బు, పక్షవాతం వంటి వ్యాధులను నివారించటానికి ప్రయత్నించండి.

మీ ఉద్యోగ, వ్యాపారాలలో భాగంగా ఎక్కువ సమయం నిశ్చలంగా ఉండాల్సివస్తే, కనీసం కూర్చోకుండా ఉండటానికి ప్రయత్నించండి.టెక్నాలజీ మన జీవితంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో, అంత నష్టాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News