ఉత్కంఠగా ఉండేవన్నీ క్లాసిక్ కాదు.. కానీ ఇది మాత్రం..
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే భావోద్వేగం. చాలాసార్లు ఈ భావోద్వేగాలను బ్యాట్స్ మెన్ మోసేవారు. కానీ ఈ సారి భారత బౌలర్లు..
By : R Kaushik
Update: 2024-06-10 11:19 GMT
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ లు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే అన్ని మ్యాచ్ ఉత్కంఠగా జరగాలని లేదు. అలా ఉత్కంఠగా జరిగిన కొన్ని మ్యాచ్ లు మాత్రమే క్లాసిక్ గా నిలిచిపోతాయి. తాజాగా యూఎస్ఏ లో జరిగిన మ్యాచ్ లో ఇదే విధంగా జరిగింది. బహూశా ఇది ఒత్తిడి తీవ్రత కావచ్చు. అయితే భారత ఆటగాళ్లు మైదానంలో వారి భావోద్వేగాలను అదుపులోకి ఉంచుకుని, క్రమశిక్షణాయుతమైన ఆటను ప్రదర్శించారు.
దక్షిణాఫ్రికా లో 2007 లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. మొదటగా గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ టై గా ముగిసింది. అయితే బౌలౌట్ పద్ధతిలో భారత్ ఈ మ్యాచ్ ను ముగించింది. ఫైనల్ లో భారత్- పాకిస్తాన్ మరోసారి తలపడ్డాయి. ఫైనల్ ఓవర్లో మిస్బా ఉల్ హక్, జోగిందర్ శర్మ బౌలింగ్ కొట్టిన షాట్ ను షార్ట్ ఫైన్ లెగ్ లో ఉన్న శ్రీశాంత్ అందుకుని భారత్ ను విజేతగా నిలిపాడు.
ఏడాదిన్నర క్రితం, మెల్ బోర్న్ లో జరిగిన మరొక థ్రిల్లర్ ఈ జాబితాలో చేరింది, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి అజేయంగా 82 పరుగులతో భారత్ ను విజేతగా నిలిపాడు. ఇది ప్రపంచంలోని అత్యున్నత ఇన్సింగ్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది.
దుర్భేద్యమైన రక్షణ
నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగింది. దాదాపు 34 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇందులో ఎక్కువగా భారత అభిమానులే ఉన్నారు. పోలీసులు కూడా భారీస్థాయిలో మ్యాచ్ కు బందోబస్తు కల్పించారు. అయితే భారత్ ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరుకు పరిమితం అయింది. అయితే ఈ స్కోర్ ను భారత పులులు కాపాడుతుకుంది.
ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో పాకిస్తాన్ కు సూపర్ 8 కు చేరుకోవడం దాదాపుగా చాలా కష్టంగా మారనుంది. పాక్ ఇప్పటికే భారత్ తో పాటు యూఎస్ఏ చేతిలో ఓడిపోయింది. దాయాది జట్టు తరువాత మ్యాచ్ లను కెనడా, ఐర్లాండ్ లతో తలపడనుంది. వీటిలో గెలిచిన మిగిలిన మ్యాచ్ ఫలితాల మీద పాకిస్తాన్ ఆధారపడాల్సి ఉంటుంది.
అయితే ఈ రెండు జట్లలో పాక్ బౌలర్ల కంటే భారత బౌలర్లు ఎక్కువ క్రమశిక్షణ తో ఉన్నారని చెప్పవచ్చు. T20 గేమ్‌లో ఎనిమిది మంది ఫాస్ట్ బౌలర్లు చర్చనీయాంశం కావడం ఎప్పుడో కానీ జరగదు. షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్‌లు భారత్‌ను దిగ్విజయంగా అడ్డుకట్ట వేశారని ఆ జట్టు ఆనందంలో ఉంది. ఎందుకంటే అప్పటి వరకూ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. 81 పరుగుల వరకూ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అయితే తరువాత అనూహ్యంగా జట్టు కుప్పకూలింది. మరోవైపు ఇదే స్థితిలో పాక్ జట్టు సైతం ఇదే స్థితిలో నిలిచిన సమయంలో భారత బౌలర్లు చెలరేగి పాక్ 113 పరుగులకే కట్టడి చేశారు.
20-ఓవర్ల గేమ్‌లో 119 పరుగులను కాపాడుకోవడం అన్ని వేళల్లో కుదరదు. కానీ ఈ అసాధ్యాన్ని భారత్ ఇప్పుడు చేసి చూపింది. పాక్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆకాశం మేఘావృతం అయింది. చిరుజల్లులు కురిసి, ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంది. దీన్నివారు సద్వినియోగం చేసుకున్నారు.
వరుసగా రెండో రోజు స్టేడియంలో మ్యాచ్ లు జరిగినప్పటికీ పిచ్ బౌలర్లకే ఎక్కువగా అనుకూలంగా ఉందనేది వాస్తవం. దాని తగ్గట్లుగానే ఒపెనర్లు విరాట్,రోహిత్ త్వరగానే పెవిలియన్ చేరారు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన పంత్, బ్యాటింగ్ ప్రమోషన్ పొంది నాలుగో స్థానంలోకి వచ్చిన అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను స్టడీగా నిర్మించారు. వీరి బ్యాటింగ్ శైలి చూసి జట్టు 140 పరుగులు సాధిస్తుందని అంచనాలు వచ్చాయి. కానీ రెండో సగం మ్యాచ్ ప్రారంభం కాగానే అనవసర షాట్లతో బ్యాట్స్ మెన్ వికెట్లు సమర్పించుకున్నారు.
పాక్ అదృష్టం..
బాబర్ ఆజామ్, రిజ్వాన్ లక్ష్యం కోసం మైదానంలోకి దిగినప్పుడు ఆకాశం నిర్మలంగా మారి, సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోయింది. ఇది భారత బౌలర్లకు నిరాశ కలిగించే అంశం. అయితే మన బౌలర్లు చాలా క్రమశిక్షణగా బంతులు వేశారు. వికెట్లు పడినప్పుడు ఎక్కువ ఆనంద పడకుండా, బౌండరీలు బాదినప్పుడు కలవరపడకుండా లైన్ అండ్ లెన్త్ తో బంతులు సంధించారు.
భూమ్రాస్త్రం..
భారత్ కు నిజంగా దొరికిన వరం భూమ్రా. అతను సమానులలో ప్రథముడు. టీ20 ఫార్మాట్ కు అచ్చుగుద్దినట్లు సరిపోయే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది అతనే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రతి మ్యాచ్ లో అతని నాలుగు ఓవర్ల కోటా అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. మొదటి ఓవర్ లోనే రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్ ను దూబే వదిలేశాడు. అది భూమ్రా బౌలింగ్ లోనే. దానిని సద్వినియోగం చేసుకున్న అతను మ్యాచ్ ను ఏకపక్షంగా ముగించడానికి ప్రయత్నించాడు. అయితే రెండో స్పెల్ లో బౌలింగ్ దిగిన భూమ్రా ఈ సారి రిజ్వాన్ ను విజయవంతంగా పెవిలియన్ పంపాడు. తన కోటా రెండు ఓవర్ల లో 2-0-9-1 సగం పని మాత్రమే పూర్తయింది.
15వ ఓవర్ వరకూ మూడు వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 80 పరుగులు చేసింది. విజయానికి పాక్ చేరువవుతున్న తరుణంలో మరోసారి బౌలింగ్ కు దిగిన యార్కర్ కింగ్ వచ్చిరాగానే రిజ్వాన్ ను బౌల్డ్ చేశాడు. ఇప్పటి వరకూ భూమ్రా తన కెరీర్ లో వేసిన ఆరు అత్యుత్తమ స్పెల్ లో ఇది ఒకటిగా నిలిచిపోతుండనడంలో సందేహం లేదు.
తిరిగి భూమ్రా 19 ఓవర్ వచ్చే సరిగి పాక్ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు చేయాలి. కానీ ఆ ఓవర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇప్తికార్ ను వెనక్కి పంపాడు. చివరగా తన స్పెల్ ను 4-0-14-3 తో ముగించాడు. చివరి ఓవర్ లో అర్షదీప్ 18 పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేసి భారత జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇది భారత బౌలర్లు అందించిన విజయంగా చెప్పవచ్చు.