చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా, డబ్ల్యూటీసీ ఫైనల్ లో గెలుపు
చోకర్స్ నుంచి ఛాంపియన్ అయిన సౌత్ ఆఫ్రికా;
By : The Federal
Update: 2025-06-14 13:03 GMT
దక్షిణాఫ్రికా చివరకు సాధించింది. మూడు దశాబ్ధాలుగా ఐసీసీ ట్రోఫి కోసం ఎదురుచూస్తున్న దాని కల నెరవేరింది. ఓటమి కోరల్లో నుంచి అనూహ్యంగా పుంజుకుని గెలుపుబాట పట్టిన దాని పోరాటం అద్భుతం.
లార్డ్స్ వేదికగా జరగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా విధించిన 282 పరుగులను ఐదు వికెట్లను కోల్పోయి ఛేదించింది. నాలుగో రోజు ఉదయం 213/2 ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే కెప్టెన్ బవూమా వికెట్ కోల్పోయింది.
తరువాత కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ట్రిస్టన్ స్టబ్స్ పట్టుమని పది పరుగులైన చేయకుండా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ పట్టు బిగుస్తుందని అంతా భావించారు.
కానీ మరో వైపు మార్క్రమ్ కు తోడుగా బెడింగ్ హమ్ నిలవడంతో లక్ష్యం వైపు వడివడిగా వెళ్లారు. విజయానికి మరో ఆరు పరుగుల దూరంలో సెంచరీ హీరో అయిడెన్ మార్ క్రమ్(136) అవుట్ అయ్యాడు. హజిల్ వుడ్ బౌలింగ్ ట్రావిస్ హెడ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కతో మార్క్రమ్ వెనుదిరగాల్సి వచ్చింది.
ఆసీస్ మొదటి ఇన్సింగ్స్..
ఈ మ్యాచ్ లో ఆసీస్ మొదటగా బ్యాటింగ్ చేసి 212 పరుగులు సాధించింది. అయితే తరువాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 138 పరగులకే ఆలౌట్ అయి ప్రత్యర్థికి 74 పరుగుల ఆధిక్యం అప్పగించింది.
రెండో ఇన్సింగ్స్ లోనూ దక్షిణాఫ్రికా బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేసినప్పటికి చివరలో పట్టు విడిచినట్లు కనిపించింది. దీనితో రెండో ఇన్సింగ్స్ లో ఆసీస్ 207 పరుగులకు ఆలౌట్ అయి దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
లార్స్డ్ లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 250 పరుగుల లక్ష్యం విజయవంతంగా ఛేదించారు. కానీ ఆసీస్ 282 పరుగుల లక్ష్యం విధించడంతో దానిదే గెలుపని అంతా అనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా ఎక్కడా అవకాశం ఇవ్వకుండా విజేతగా నిలిచింది. అలాగే ఆసీస్ 1996 తరువాత తొలిసారిగా ఐసీసీ ఫైనల్ లో పరాజయం పాలైంది.
ఆరంభంలోనే వికెట్లు..
లార్డ్స్ లో మంచి బ్యాటింగ్ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రికిట్ టన్ త్వరగా పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ లో వచ్చిన ముల్డర్ మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించిన ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. కానీ ఒపెనర్ మార్క్రమ్ తోడుగా కెప్టెన్ బవుమా జట్టును విజయం దిశగా నడిపించారు.
దక్షిణాఫ్రికా 1998 లో చివరిసారిగా ఐసీసీ నాకౌట్ ను గెలిచింది. 27 సంవత్సరాల తరువాత మరోసారి ఐసీసీ ఫైనల్స్ లో విజేతగా నిలిచారు. ఇంతకుముందు 12 సార్లు వివిధ ట్రోఫిలలో ఫైనల్, సెమీ ఫైనల్ చేరిన గెలుపు ముంగిట బోల్తాపడి చోకర్స్ అనే అపవాదును మోశారు. ఇక ఆ అపవాదును, చోకర్స్ అనే ముద్రను దక్షిణాఫ్రికా ఈ విజయంతో వదులుకున్నట్లు అయింది.