ఇక ముందు అలాంటి క్యాచ్ లు కుదరవు: ఐసీసీ

బౌండరీ అవతల క్యాచ్ పట్టే నిబంధనలు మార్చిన ఎంసీసీ;

Update: 2025-06-14 12:33 GMT
బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పడుతున్న ఆటగాడు

బౌండరీల వద్ద పట్టే క్యాచ్ ల విషయంలో ఐసీసీ రూల్స్ ను మార్చింది. చాలామంది ఫీల్డర్లు బౌండరీ ముందు క్యాచ్ పట్టాక బంతిని మైదానంలోకి రాకముందు వివిధ విన్యాసాలతో క్యాచ్ పడుతున్నారు. ఇక ముందు అలాంటివి కుదరవని తేల్చి చెప్పింది. 

రోప్ అవలే మళ్లీ గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకుని తిరిగి రోప్ ఆవలకు విసిరి మళ్లీ క్యాచ్ తీసుకోవడం నిబంధనలకు విరుద్దమని తెలిపింది. ఇక ముందు ఇలాంటివి క్యాచ్ లు చెల్లవని మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ ప్రకటించింది.

కొత్త రూలింగ్ ప్రకారం పాత చట్టాలు అన్నీ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమలులోకి వస్తున్నాయి. పాత చట్టాలు అన్నీ ఎంసీసీలో విలీనం కాబోతున్నాయి.

బిగ్ బాష్ లీగ్ 2023 లో మైఖేల్ నెజర్ పట్టిన క్యాచ్ అత్యంత వివాదాస్పదంగా మారింది. అంతకుముందు 2020 లో మాట్ రెన్ షా, టామ్ బాంటన్ సహాయంతో పట్టిన క్యాచ్ పలు విమర్శలకు దారితీసింది. ఇకపై అలాంటి క్యాచ్ లను చట్టవిరుద్దంగా ప్రకటించారు.
సభ్యదేశాలకు ఐసీసీ పంపిన ఎంసీసీ నోట్ ప్రకారం.. ‘‘చాలామంది క్రికెట్ ప్రజలకు అన్యాయంగా కనిపించే కొన్ని అసాధారణ క్యాచ్ లకు కూడా అనుమతిచ్చింది’’.
బ్రిస్బేన్ హీట్ తరఫున నెజర్ పట్టిన క్యాచ్ ద్వారా జోర్డాన్ సిల్క్ ను అవుట్ చేయడం పై ఈ నోట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో నెజర్ పట్టిన క్యాచ్ చట్టబద్దంగానే ఉందని తెలిపింది.
కానీ ఫీల్డర్ చాలా దూరం వెళ్లినట్లు అనిపించిందని నోట్ లో పేర్కొన్నారు. రెండు సందర్బాలు విస్తృత చర్చకు దారి తీశాయి. దీనితో ఐసీసీ, ఎంసీసీ లా 19.5.2ను సమీక్షించాయి. ఇది చివరిగా సారిగా 2010 లో సవరించారు.
బౌండరీ అవతల దూకిన తరువాత రెండోసారి బంతిని గాల్లోనే తాకితే కచ్చితంగా అది బౌండరీగా పరిగణించబడుతుందని సవరించింది. బంతిని తాకిన తరువాత బౌండరీ వెలుపల ఇవల వైపుకు రావాల్సిందే అని నిబంధనలు మార్చింది.
జూన్ 17 నుంచి కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ ప్రారంభం అవుతుంది. శ్రీలంక - బంగ్లాదేశ్ మధ్య గాలెలో జరిగే మ్యాచ్ లో ప్రారంభమయ్యే వరకూ విస్తరించిన నియమం అమలులోకి వస్తుంది. చట్టాలో మార్పు అక్టోబర్ 2026 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది.
Tags:    

Similar News