ఢిల్లీకి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ప్రధానితో భేటీ

దశాబ్ధం తరువాత భారత్ కు ఐసీసీ ట్రోఫి అందించిన టీమిండియా ఆటగాళ్లు ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో అల్పాహారం చేసి..

Update: 2024-07-04 08:24 GMT

కరేబియన్ దీవులలో 2024 ఐసిసి టి 20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు గురువారం (జూలై 4) ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని విజేత జట్టును స్వాగతించేందుకు వందలాది మంది అభిమానులు ఢిల్లీ విమానాశ్రాయానికి చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ అంతా సందడి వాతావరణం నెలకొంది.



 


శనివారం (జూన్ 29) బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇంటికి బయల్దేరేముందు అట్లాంటిక్ సముద్రంలో సంభవించిన బెరిల్ హరికేన్ కారణంగా జట్టు ఐదు రోజుల పాటు బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. అనంతరం బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిరిండియా విమానంలో 16 గంటల నాన్‌స్టాప్ విమానంలో గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.



 


ట్రోఫిని అందుకున్న రోహిత్ శర్మ ను అభిమానులు ఉత్సాహాపరిచారు. అనంతరం ఆటగాళ్లంతా హోటల్ గదులకు వెళ్లారు. ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని టీమిండియా ఆటగాళ్లు కలిశారు. ప్రధానితో ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు.


 

అనంతరం ఆటగాళ్లంతా నేరుగా ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. ఆటగాళ్లకు సాయంత్రం వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానం చేయడానికి బీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. దానికంటే ముందు ముంబై వీధుల్లో ఒపెన్ టాప్ బస్ పై ఊరేగింపు ఉంది. భారత్ 11 ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫి నెగ్గింది.


 



Tags:    

Similar News